Top

నటి హిమజకు పవన్‌ లేఖ... ఖుషిలో బిగ్ బాస్ బ్యూటీ!

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హిమజ నటిస్తున్నారు. తాజాగా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు హిమజ..

నటి హిమజకు పవన్‌ లేఖ... ఖుషిలో బిగ్ బాస్ బ్యూటీ!
X

బుల్లితెర నటిగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న హిమజ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోతుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హిమజ నటిస్తున్నారు. తాజాగా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు హిమజ.. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోలను సైతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తాజాగా మరో విషయాన్నీ అభిమానులతో ఆనందంగా పంచుకుంది హిమజ.. అదేంటంటే.. "నటి హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను" అని పవన్ రాసిన లేఖను ఆమె షేర్‌ చేస్తూ.. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు.


Next Story

RELATED STORIES