ప్రేక్షకులు నన్ను అలాగే చూసేవారు.. అదే ఇబ్బందిగా ఉండేది : ప్రీతి జింగానియా

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నటి ప్రీతి జింగానియా. నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ ఆమె ఖాతాలో ఉంది.

ప్రేక్షకులు నన్ను అలాగే చూసేవారు.. అదే ఇబ్బందిగా ఉండేది : ప్రీతి జింగానియా
X

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నటి ప్రీతి జింగానియా. నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ ఆమె ఖాతాలో ఉంది. గత రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్న తర్వాత, తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టింది. అయితే ఇటీవల ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ఈ భామ. ప్రేక్షకులు కేవలం తనను మోడరన్‌ పాత్రలో కంటే చీరలోనే చూడటానికి ఇష్టపడుతుండడం కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. స్క్రీన్ పైన కిస్సింగ్ సీన్స్ చేస్తే స్వీకరించలేకపోయేవారని, అందుకే తన కెరీర్ లో డిఫిరెంట్ రోల్స్ చేయలేకపోయాయని, ఎక్కువగా పద్దతిగా ఉన్న పాత్రలోనే కనిపించానని తెలిపింది. ఇలా ఒక జోనర్‌కే పరిమితమై నటించడం ఎవరికైనా ఇష్టం ఉండదని చెప్పింది ప్రీతి. 18 ఏళ్ల తన సినీ కెరీర్ లో 39 సినేమలుక్ చేసిన ఈ బ్యూటీ.. నటుడు పర్విన్ దాబాస్‌తో పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.

Next Story

RELATED STORIES