సినీ నటుడు పృథ్వీరాజ్ కు రోడ్డు ప్రమాదం

నటుడి ఆరోగ్య పరిస్థితిని గురించి..

సినీ నటుడు పృథ్వీరాజ్ కు రోడ్డు ప్రమాదం
X

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ అకౌంట్ లో నటుడి టీమ్ వెల్లడించింది. బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్ కారు వెళుతుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నటుడి కారు ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టు పక్కల జనం గుమికూడారు అంటూ ధ్వసమైన కారు ఫోటోను షేర్ చేసింది. అయితే నటుడి ఆరోగ్య పరిస్థితిని గురించి, ప్రమాదంలో గాయాల్లాంటివి ఏమైనా సంభవించాయో లేదా అనేది అందులో తెలియపరచలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, గతంలో ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్ కు వెళ్లి 15 రోజులు ఉండమని వైద్యులు సూచించడంతో పూర్తిగా కోలుకున్నానని పృథ్వీ అప్పట్లో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES