పూరీయిజం గురించి ఇంట్రస్టింగ్ విషయాలు..

దర్శకుడుగా, మాటల రచయితగా, చివరికి సినిమా టైటిల్స్ పెట్టడంలో కొన్ని సార్లు విమర్శలు వచ్చినా..

పూరీయిజం గురించి ఇంట్రస్టింగ్ విషయాలు..
X

దర్శకుడు పూరీ జగన్నాథ్.. మాటలు, చేతలే కాదు.. చిత్రాలు కూడా డైనమిక్ గానే ఉంటాయి. అందుకే ఈ తరంలో అతనో ఫైరింగ్ అండ్ ఇన్స్ స్పైరింగ్ డైరెక్టర్. ఇండస్ట్రీలో తనకంటూ ఓ కొత్త పాథ్ క్రియేట్ చేసుకుని అనేక మందికి మార్గదర్శిగా నిలిచిన పూరీ బర్త్ డే ఇవాళ(సెప్టెంబర్ 28).

చూడ్డానికి సింపుల్ గానే కనిపిస్తాడు. కానీ అతని మస్తిష్కం చాలా ముందుకు వెళ్లి ఆలోచిస్తుంది. థింకింగ్ లోనే కాదు.. మేకింగ్ లోనూ షార్ప్ గా ఉంటాడు. సాధారణ సన్నివేశాన్ని మాటలతో వాహ్ అనేలా చేస్తాడు.. చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్స్ తో శెభాష్ అనిపిస్తాడు. ఇదే పూరీని స్పెషల్ డైరెక్టర్ గా మలిచింది. అతని స్కూల్ ను ఫాలో అవుతూ తర్వాత ఎంతోమంది దర్శకులు ప్రయత్నాలు చేశారు.. చాలామంది సక్సెస్ అయ్యారు కూడా.

2000 ఏప్రిల్ 20న బద్రి సినిమా విడుదలైంది. తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి వరకూ వచ్చిన సినిమాలకు భిన్నమైన డైలాగ్స్, హీరోయిజంలో డైనమిజం.. వైవిధ్యమైన ప్రేమకథ, మంచి పాటలు, ఎంటర్టైన్మెంట్.. ఇలా ఎలా చూసినా పూర్తిగా పూరీ మార్క్ ఉన్న సినిమా అది. అందుకే అతను ఓవర్ నైట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

దర్శకుడిగా పూరీ శైలి విలక్షణం. ట్రెండ్ కు భిన్నమైన రూట్ ను క్రియేట్ చేసుకున్నాడు. హీరో అంటే సద్గుణ సంపన్నుడు, సకళ కళావల్లభుడు అన్నతెలుగు సినిమా సూత్రాన్ని చెరిపేసి తన హీరో ఇడియట్ అనేశాడు. హీరో ఇడియట్ అంటే నిర్మాత భయపడతాడని తనే నిర్మాతగానూ మారాడు. దీంతో ఒక దశాబ్ధం పాటు ఏ హీరో అయినా పూరీ హీరోలా ఉండాలి అనుకున్నాడు. అందుకు కారణం అతని హీరో ఇడియట్ అయినా పోకిరి అయినా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడు కాబట్టే.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక్కసారైనా నటించాలి.. అని అనుకోని హీరో ఓ దశాబ్ధం పాటు లేడు. అందుకు కారణం పోకిరి. అంతకు ముందు ఎన్ని హిట్లున్నా.. పోకిరి పూర్తిగా పూరీ మార్క్ సినిమా. సింపుల్ గా కనిపించినా బలమైన సన్నివేశాలు.. క్యాజువల్ గా అనిపించినా.. ప్రేక్షకుల చేత కేకలు వేయించి.. ఇప్పటికీ ఊతపదాలుగా ఉన్నాయా డైలాగులు. పూరీ టేకింగ్ కెపాసిటీకి అదే స్థాయిలో యాడ్ అయిన పెన్ పవర్ క్రియేట్ చేసిన సంచలనమే పోకిరి.

దర్శకుడుగా, మాటల రచయితగా, చివరికి సినిమా టైటిల్స్ పెట్టడంలోనూ పూరీది పూర్తిగా భిన్నమైన శైలి. కొన్ని సార్లు విమర్శలు వచ్చినా.. తన పంథా వీడలేదు. నెగెటివ్ కమెంట్స్ వస్తున్నా.. పోకిరి తర్వాత మరోసారి దేశముదురు అంటూ అల్లు అర్జున్ లోని మాస్ యాంగిల్ ను ఊరమాసివ్ గా చూపించాడు.

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని కలలు కనని డైరెక్టర్ ఉంటాడా. ఆయనతో సినిమా చేయలేదు కానీ, మెగా పవర్ స్టార్ గా వెలుగుతోన్న రామ్ చరణ్ ను వెండితెరకు పరిచయం చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు పూరీ. కథ రొటీనే అయినా.. హీరోగా రాణించడానికి చరణ్ కున్న కేపబిలిటీస్ అన్నిటినీ చూపించాడు. అందుకే చిరుతనయుడు చిరుతలా అందరినీ మెప్పించాడు. అయితే చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అతని కల మాత్రం ఇంకా నెరవేరలేదు.

పన్నెండేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తూ.. కెమెరామెన్ గంగతో రాంబాబుతో వచ్చాడు. ఈ మూవీ ఆకట్టుకోలేదు. ఆ టైమ్ లో పూరీ పూర్తిగా తన మార్క్ కోల్పోయాడు. ఏదేమైనా పూరీ మా సెడ్డ క్రియేటివ్. కొన్ని థాట్స్ అతనికే వస్తాయి. ఆ థాట్స్ ను తెరకెక్కించడంలోనూ అతను ఎక్స్ పర్ట్. అసలు హీరోలు హీరోల్లా ఉండడం కూడా అతనికి నచ్చదు. వాళ్లని పూర్తిగా మార్చేస్తాడు. అందుకే ఎన్టీఆర్ వంటి మాస్ హీరోను కూడా విలన్ గా చూపించేసి తన టెంపర్ తో మరో హిట్ అందుకున్నాడు.

మొత్తంగా రెండు దశాబ్ధాల కెరీర్ లో పూరీ జగన్నాథ్ తొలి దశాబ్ధాన్ని రూల్ చేశాడు. ఎంత పెద్ద స్టార్ అయినా అతనితో సినిమా చేస్తే అతను పూరీ హీరో అవుతాడు అనేలా ట్రెండ్ క్రియేట్ చేశాడు. అతని సినిమాల్లో హీరోల్లానే అతనూ రియల్ లైఫ్ లో డైనమిక్ గానే ఉంటాడు. అదే పూరీయిజంగా మారింది.

Next Story

RELATED STORIES