Puri Jagannadh: ఇండస్ట్రీలోకి పూరీ కూతురు ఎంట్రీ.. కానీ హీరోయిన్‌గా కాదట..

Puri Jagannadh: ఇండస్ట్రీలోకి పూరీ కూతురు ఎంట్రీ.. కానీ హీరోయిన్‌గా కాదట..
Puri Jagannadh: పూరీ వారసుడు ఆకాశ్ పూరీ ఇప్పటికే హీరోగా సెటిల్ అయిపోయాడు. ఇక కూతురి పవిత్ర కూడా అవే ప్రయత్నాలు చేస్తోందట

Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్. సినీ పరిశ్రమలో ఉండే దాదాపు చాలామంది నటీనటులు మాత్రమే కాదు టెక్నిషియన్లు కూడా తమ వారసులను హీరోలు లేదా హీరోయిన్లు అవ్వాలనే కోరుకుంటారు. అలా వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటుండగా.. కూతురు కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుందని టాక్.

వరుస ఫ్లాపులను ఎదుర్కున్న తర్వాత పూరీ జగన్నాధ్.. మళ్లీ ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్నాడు. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన 'లైగర్'తో మళ్లీ టాప్‌లోకి వెళ్లాలని చూస్తున్నాడు. డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా 'పూరీ కనెక్ట్స్' అనే ప్రొడక్షన్ కంపెనీతో చిత్రాలను నిర్మిస్తున్నాడు. పూరీతో పాటు చార్మీ కూడా ఇందులో సహ నిర్మాతగా ఉంటోంది.

పూరీ వారసుడు ఆకాశ్ పూరీ ఇప్పటికే హీరోగా సెటిల్ అయిపోయాడు. ఇక కూతురి పవిత్ర పూరీ కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందట. కానీ హీరోయిన్‌గా కాదట. పూరీ నిర్మాణ సంస్థ అయిన పూరీ కనెక్ట్స్‌లో పవిత్ర కూడా నిర్మాతగా ఉండనున్నట్టు సమాచారం. ఇక సినీ పరిశ్రమలో ఉన్న తక్కువమంది నిర్మాతల్లో పవిత్ర కూడా ఒకటి కాబోతుందా లేదా తెలియాలంటే కాస్త సమయం పడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story