చెత్త మనుషుల మధ్య నా జీవితం సగం..: పూరీ జ్ఞానోదయం

చెత్త మనుషుల మధ్య నా జీవితం సగం..: పూరీ జ్ఞానోదయం
నలుగురికీ మార్గదర్శకత్వం కావాలనుకుంటున్నారు డైరెక్టర్ పూరీజగన్నాథ్.

జీవితం మనకెన్నో పాఠాలు నేర్పుతుంది.. అందరి జీవితాలు ఒకేలా ఉండవు.. ఎవరి జీవితాలు వారివి.. ఎదురు దెబ్బలు ఎన్నో తగులుతాయి.. అన్నీ తట్టుకుని నిలబడాలి.. తాము చేసిన తప్పొప్పుల గురించి విశ్లేషించుకుని బాధపడుతూ కూర్చోక అందులో నుంచి బయట పడుతూ నలుగురికీ మార్గదర్శకత్వం కావాలనుకుంటున్నారు డైరెక్టర్ పూరీజగన్నాథ్. ఇదే విషయాన్ని పూరీ మ్యూజింగ్స్‌లో ప్రస్తావించారు.

ఎడ్మండ్ హిల్లరీకీ ఎవరెస్ట్ ఎక్కాలని కోరిక.. 352 మంది పోర్టల్స్, కొంతమంది డాక్టర్లు, మరో 20 మంది సహాయకులు, ఆహారం, మిగతా వస్తువులో కలిసి మొత్తం 4500 కేజీలు ఉంటుంది . అంతెత్తున ఉన్న ఎవరెస్ట్ ఎక్కడానికి అంత లగేజీ అవసరమా అని కొంత దూరం వెళ్లాక సగం లగజీ వదిలేశాడు. బేస్ క్యాంప్ వచ్చేసరికి మరికొంత అనవసరం అనిపించి దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. లగేజీతో పాటు తనతో వచ్చిన నాలుగు వందల మందిలో కొంత మందిని వెనక్కి పంపించాడు.

మోస్లూ నడుస్తుంటే ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుస్తుంది. వాటన్నింటినీ వదిలించుకుంటూ చివరకు తానొక్కడే ఎవరెస్ట్ ఎక్కాడు. నిజానికి ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నది అతనొక్కడే.. ఈ నాలుగొందల మంది కాదు. అలాగే జీవితంలో నువ్వు అనుకున్న గమ్యం చేరుకోవాలంటే అనవసరమైన లగేజీని పక్కన పెట్టు. కొండకు తాడు కట్టి దాన్ని పట్టుకుని ఎక్కుతున్నప్పుడు నీకు నువ్వే బరువు.. అలాంటిది నిన్ను పట్టుకుని మరికొంత మంది వేలాడుతుంటే అది సాధ్యమేనా.. ఎక్కాలనుకున్నది నువ్వు.. వాళ్లు కాదు. వాళ్లందరూ నీకు చేసే సాయం ఏంటో తెలుసా.. నిన్ను ఎక్కనివ్వకుండా చేయడమే.

అందుకే మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. చెత్త రూపంలో ఉన్న మనుషులు మనమధ్యే ఉంటారు. ఆ విషయాన్ని నేను గుర్తించేసరికి నా జీవితంలో సగం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి.. ట్రాష్ బ్యాగ్ ఎప్పుడూ నవ్వుతూ మనవెంటే వుంటుంది. దాని మీద ట్రాష్ బ్యాగ్ అని రాసి ఉండదు. అయితే ఆ ట్రాష్ బ్యాగ్‌ను గుర్తించి ఎప్పటికప్పుడు వదిలించుకుంటేనే నీ సక్సెస్ అని పూరీ జగన్నాథ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story