Pushpa 2: ఊహు అంటోన్న సామ్... కావాలంటోన్న సుక్కు

Pushpa 2: ఊహు అంటోన్న సామ్... కావాలంటోన్న సుక్కు
పుష్ప 2లో అదిరిపోయే ఐటమ్ సాంగ్; నా వల్ల కాదంటోన్న సమంత...

ఒకే ఒక్క ఐటమ్ సాంగ్ తో అప్పటివరకూ చేసిన పాత్రలన్నీ మరచిపోయేట్లు చేసిన సమంత మళ్లీ అదే ఫీట్ ను రిపీట్ చేయమంటే మాత్రం నో అని చెప్పేస్తోందట. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విజయం సమంత ఐటమ్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇప్పుడు పుష్ప 2 పట్టాలెక్కుతోంది. ఇందులోనూ సమంత తోనే మళ్లీ ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశాడట సుక్కూ. అయితే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సమంత ఇందుకు నో అని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ ను దాడి, హాలీవుడ్ రేంజ్ లో ఆఫర్లు అందుకుంటోన్న సమంత మళ్లీ ఐటమ్ సాంగ్ చేయదలచుకోవడంలేదట. అందుకే రూ. 5కోట్లు ఇస్తామన్నా.. అమ్మడు ఒప్పుకోవడంలేదట. మరోవైపు సుకుమార్ మాత్రం సమంతనే కావాలని పట్టుపడుతున్నాడని వినికిడి. మరి ఇందులో ఎవరు మాట నెగ్గుతుందో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story