Pushpa ; ఫిక్స్ ... అవును పుష్ప రెండు భాగాలుగానే..!

Pushpa ; ఫిక్స్ ... అవును పుష్ప రెండు భాగాలుగానే..!
అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా నటిస్తున్నాడు. బన్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపైన చిత్రనిర్మాతల్లో ఒకరైనా రవిశంకర్ స్పందించారు. సినిమా రెండు భాగాలుగా రానుందని వెల్లడించారు. ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమేనని భావించి.. అందరం కలిసి రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

సెకండ్ పార్ట్ ఇప్పటికే 10% పూర్తి అయిందన్నారు. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ‌

Tags

Read MoreRead Less
Next Story