'PVT04' 'ఆదికేశవ'.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల

PVT04 ఆదికేశవ.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌పై పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌పై పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ 'PVT04'కి 'ఆదికేశవ' అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. తాజాగా సోమవారం మేకర్స్‌ ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు. ఆదికేశవ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్ రుద్రగా పరిచయం అయ్యాడు. అయితే గ్లింప్స్ ఆసక్తికరంగానే ఉంది. అయితే హైపర్‌ గర్ల్‌ శ్రీలీల ఈ సినిమాలో చిత్ర అనే పాత్రలో నటిస్తుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్ కి ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఆదికేశవ జూలై నెలలో విడుదల కానున్నట్లు మేకర్స్‌ వెల్లడిస్తున్నారు. వైష్ణవ్‌కు ఉప్పెన తరువాత అనుకున్నంతగా హిట్‌ సినిమాలు తగల్లేదు. ఈ సారైనా బ్లాక్‌బస్టర్‌ లభిస్తుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story