మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన ఆర్ నారాయణమూర్తి..!

ప్రబోధాత్మకమైన సినిమాను ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించారని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన ఆర్ నారాయణమూర్తి..!
X

ప్రబోధాత్మకమైన సినిమాను ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించారని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రైతన్న సినిమాను నారాయణమూర్తి తీశారని ఆయన తెలిపారు. రైతన్న సినిమా ఈ నెల 14 విడుదలవుతున్న సందర్బంగా.... నారాయణ మూర్తి మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి.. సినిమాను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. మన దేశంలో స్వేచ్చ వాణిజ్యం సాధ్యం కాదని, కేంద్రం తెచ్చిన చట్టాలను వెనక్కితీసుకోవాలని ఆర్ నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడంలేదని.. స్వామినాథన్ కమిటి సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

RELATED STORIES