కోయిలమ్మ హీరో సమీర్‌ అలియాస్‌ అమర్‌పై లైంగిక వేధింపుల కేసు

తాగిన మత్తులో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడు అమర్‌.

కోయిలమ్మ హీరో సమీర్‌ అలియాస్‌ అమర్‌పై లైంగిక వేధింపుల కేసు
X

కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్‌ అలియాస్‌ అమర్‌పై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాగిన మత్తులో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడు అమర్‌. మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ.. రెచ్చిపోయాడు. రాత్రి 9 గంటలకు తమ ఇంటికి వచ్చి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళలు.

అమర్‌తో పాటు మరో ముగ్గురు, అతని గర్ల్‌ ఫ్రెండ్‌ స్వాతి.. తమపై దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వద్ద నుంచి 5 లక్షల రూపాయలు నగదు తీసుకున్నారని, అడిగితే రౌడీయిజం చేస్తున్నారని చెప్పారు.. ప్రాణహాని ఉందని చెప్పడంతో మహిళలకి రక్షణ ఇచ్చిన పోలీసులు.. అమర్‌పై FIR నమోదు చేశారు.


Next Story

RELATED STORIES