RGV konda : అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు తీసుకున్న డైరెక్టర్ వర్మ

RGV konda : అమ్మవారికి మందు తాగించి ఆశీస్సులు తీసుకున్న డైరెక్టర్ వర్మ
RGV konda : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరో సెన్సేషనల్‌ బయోపిక్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

RGV konda : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరో సెన్సేషనల్‌ బయోపిక్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు కొండా మురళి, కొండా సురేఖల జీవిత చరిత్రతో కొండా అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం వర్మ వరంగల్‌కు విచ్చేసారు. వంచనగిరిలో కొండా సినిమా ప్రారంభోత్సవం చేసిన ఆర్జీవీ.. అక్కడే షూటింగ్ మొదలుపెట్టారు.

కొండా మూవీ షూటింగ్‌కు ముందు వరంగల్‌ చేరుకున్న రాంగోపాల్‌వర్మ భారీ ర్యాలీ మధ్య కొండా సురేఖ ఇంటికి బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత.. వంచనగిరిలో ఉన్న గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని రాంగోపాల్‌ వర్మ దర్శించుకున్నారు. దేవుడిపై నమ్మకం లేని ఆర్జీవీ.. ఆలయాన్ని సందర్శించడమే కాదు.. అమ్మవారికి మందు తాగించడం హాట్‌టాపిక్‌గా మారింది.

కొండా దంపతుల బయోపిక్‌ పోస్టర్‌ను ఇప్పటికే ఆర్జీవీ రిలీజ్ చేశారు. 1980లలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు అరుణ్ అదిత్.. కొండా మురళి పాత్ర పోషిస్తుండగా, ఇర్రా మోర్.. కొండా సురేఖ పాత్రలో కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story