Ram Gopal Varma : దేవుడిని నమ్మను.. దెయ్యాన్ని పూజిస్తా.. రాత్రి స్మశానంలో క్షుద్రపూజలు.. !

Ram Gopal Varma : దేవుడిని నమ్మను.. దెయ్యాన్ని పూజిస్తా.. రాత్రి స్మశానంలో క్షుద్రపూజలు.. !
Ram Gopal Varma : ఇండస్ట్రీలో వివాదాస్పదం అంటేనే వర్మ.. వర్మ అంటేనే వివాదాస్పదం... ఎప్పుడు ఏం మాట్లాడుతాడో వర్మకే తెలియదు..

Ram Gopal Varma : ఇండస్ట్రీలో వివాదాస్పదం అంటేనే వర్మ.. వర్మ అంటేనే వివాదాస్పదం... ఎప్పుడు ఏం మాట్లాడుతాడో వర్మకే తెలియదు.. సినిమా తీసిన, కామెంట్ పెట్టిన, ఇంటర్వ్యూ ఇచ్చిన అందులో వర్మ మార్క్ తప్పనిసరి.. ఇప్పటికే బోలెడు కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న వర్మ ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సిక్రెట్ గురించి చెప్పేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో వర్మ మాట్లాడుతూ.. "నేను రాత్రి ఒక్కడినే మర్రిచెట్టు కింద స్మశానంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తాను.. అలా క్షుద్రదేవతల నుంచి కొన్ని వరాలను తీసుకొని.. ఎంత వయసు వచ్చిన సరే ఎదో కొంత ఈ ఎనర్జీ మైంటైన్ చేయడానికి ఆ పూజలే కారణం.. " అని చెప్పుకొచ్చాడు. వర్మ ఇచ్చిన ఆన్సర్‌కి యాంకర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

ఆ తర్వాత "స్మశానంలో ఒంటరిగా కూర్చొని ఆకులవైపే చూస్తూ ఉంటే ఓ దెయ్యం ప్రత్యేక్షం అవుతోంది.. అలా వాటితో మాట్లాడి, మసాజ్ వంటివి చేయించుకుంటాను.. నేను దేవుడిని నమ్మను కాబట్టి దయ్యాన్ని పూజిస్తాను" అన్నాడు. ఇక దెయ్యంతో తానెప్పుడో ప్రేమలో పడిపోయానని, అదంటే తనకి ఎక్కువ భక్తి అని తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story