ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలేంటీ.. ఏ సినిమా చూడొచ్చు!

ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలేంటీ.. ఏ సినిమా చూడొచ్చు!
శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలేంటీ పెద్దగా కాంపిటీషన్ లేకుండానే వస్తోన్న ఆ సినిమాలేంటీ.. కంటెంట్స్ ఎలా ఉంటాయి..?

పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు చిన్న సినిమాలు సైడ్ అవడం కామన్. కానీ మీడియం రేంజ్ మూవీస్ వస్తున్నప్పుడు పోటీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ అనుకోకుండా వచ్చే శుక్రవారం వస్తోన్న సినిమాలకు పెద్దగా పోటీ లేదు. అది వారి లక్కే అయినా.. పోటీ మాత్రం కామన్ గానే ఉంటుంది. ఓపెనింగ్ నుంచి కలెక్షన్స్ వరకూ కంపేరిజన్స్ తప్పవు. మరి పెద్దగా కాంపిటీషన్ లేకుండానే వస్తోన్న ఆ సినిమాలేంటీ..? తెలుసుకుందామా..!

నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ వస్తోన్న సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం అనే నమ్మకం వీరిలో బలంగా కనిపిస్తోంది. పైగా సితార బ్యానర్ లో వస్తోన్న సినిమా కాబట్టి ఫ్యామిలీ మొత్తం చూసే అవకాశం ఉంది.


రంగ్ దే ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ ఫైన్ రైడ్ లా కనిపించింది. అలాగే కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చినట్టున్నారు. తను ఇష్టపడని అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో ఆమె వల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు అనేది ఎంటర్టైనింగ్ గా చెప్పబోతున్నట్టు అర్థమైంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ ఫస్ట్ టైమ్ నితిన్ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ పాటలన్నీ హిట్టు. అలాగే పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా రంగ్ దే కు అదనపు ఎసెట్ అవుతుంది. సో ఎలా చూసినా.. ఈ మూవీ ఫ్రైడే రోజు బాక్సాఫీస్ ను గెలవడం ఖాయం అనుకోవచ్చు.

ఇక వైవిధ్యమైన సినిమాలతో సత్తా చాటుతోన్న ప్యాన్ ఇండియన్ స్టార్ రానా అరణ్య కూడా అదే రోజు వస్తోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యానిమల్ ప్రాటెక్షన్ అనే బలమైన పాయింట్ తో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ సైతం దేశం మొత్తాన్నీ ఆకట్టుకుంది. తమిళనాడులో ఇప్పటికే కొందరు ఆధ్యాత్మికత పేరుతో వందల ఎకరాల అటవీ భూముల్ని కబ్జా చేశారు. వారివల్ల ఎన్నో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించాయి కూడా. మరి ఆ పాయింట్ ను కూడా టచ్ చేస్తారా లేదా అని చెప్పలేం కానీ అరణ్యపై అంచనాలైతే భారీగా ఉన్నాయి.


అరణ్య ట్రైలర్ చూస్తే విజువల్ గా కూడా స్టన్నింగ్ గా ఉండేలా కనిపించింది. రానా లుక్ కు ఎంటైర్ కంట్రీ ఫిదా అయింది. అతను కూడా అరణ్యపై చాలా నమ్మకంగా ఉన్నాడు. తమిళ దర్శకుడ ప్రభుసాల్మన్ రూపొందించిన ఈ మూవీలో అక్కడి హీరో విష్ణు విశాల్ మరో కీలక పాత్ర చేశాడు. పొలిటీషియన్స్, కార్పోరేట్స్ కలిసి అడవులను ఎలా ధ్వంసం చేస్తున్నారనే పాయింట్ చుట్టూ కనిపిస్తున్నా.. ప్రభు సాల్మన్ టార్గెట్ వేరే ఉందనిపిస్తోంది. అయితే రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ఈ సినిమా పూర్తిగా నచ్చుతుందా అనేది పాయింట్. ఆ పాయింట్ దాటుకుని మెప్పిస్తే అరణ్య కూడా అదరగొడుతుంది.

ఈ రెండు సినిమాల తర్వాత ఒకరోజు ఆలస్యంగా రాజమౌళి ఫ్యామిలీ కుర్రాడు శ్రీ సింహా వస్తున్నాడు. తెల్లవారితే గురువారం అనే మూవీ ఇది. కుర్రాడు కొత్తవాడు, పైగా ఫస్ట్ మూవీతో ఆకట్టుకున్నాడు. రాజమౌళి బ్యాక్ ఎండ్ ఉంటుంది. కాబట్టి రిలీజ్ పెద్దగానే ఉంటుంది. ట్రైలర్ సైతం ఇంప్రెసివ్ గానే ఉంది. కాకపోతే రంగ్ దే, అరణ్య చిత్రాలకు బిగ్ హిట్ అనే టాక్ వస్తే తెల్లవారితే గురువారంపై ఆ ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. అయినా ఆడియన్స్ ను గెలుచుకోవాలంటే బలమైన కంటెంట్ ఉండాలి. మరి ఉందా లేదా అనేది రంగ్ దే, అరణ్య విడుదలైన తెల్లవారి తెలుస్తుంది.


మొత్తంగా గత మూడు నాలుగు వారాలుగా వస్తోన్న సినిమాలతో పోలిస్తే ఈ 26న ఎక్కువ సినిమాలు లేవు. కాబట్టి ఆడియన్స్ లోనూ పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. ఒకే రోజు రెండు సినిమాలూ చూసేయొచ్చు. ఆ నెక్ట్స్ డే కూడా మరో కొత్త సినిమా చూసే ఛాన్సుంది. మరి ఈ మూడు మూవీస్ లో ఆడియన్స్ చేత బ్లాక్ బస్టర్ అనే టాక్ ఎవరు ముందు తెచ్చుకుంటారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story