దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు రెడ్డి జేఏసీ వార్నింగ్‌

దిశ సినిమా ఆపకపోతే భౌతిక దాడులకైనా సిద్ధమని హెచ్చరించారు

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు రెడ్డి జేఏసీ వార్నింగ్‌
X

దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు రెడ్డి జేఏసీ వార్నింగ్‌ ఇచ్చింది. దిశ సినిమా ఆపకపోతే భౌతిక దాడులకైనా సిద్ధమని హెచ్చరించారు రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బద్దూరి వెంకటేశ్వర్‌ రెడ్డి. ఈ సినిమాను నిలిపేయాలంటూ.. హైదరాబాద్‌లోని ఫిలిం సెన్సార్ బోర్డు రీజనల్‌ ఆఫీసర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు రెడ్డి జేఏసీ నేతలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన అందరిని బాధించిందని, దీనిపై ఏకంగా సినిమా తీయడం తప్పేనన్నారు. కుటుంబసభ్యులు ఆ బాధ నుంచి కోలుకోక ముందే... వారి అనుమతి లేకుండా సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడంపై మండిపడ్డారు. వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సినిమా ఆపకుంటే వర్మ, నట్టికుమార్ ఇళ్లను ముట్టడిస్తామన్నారు.


Next Story

RELATED STORIES