RRR: ఆర్ఆర్ఆర్ ఒక సిక్ ఫిల్మ్: గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి

RRR: ఆర్ఆర్ఆర్ ఒక సిక్ ఫిల్మ్: గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి
రాజమౌళి చిత్రంపై హాలీవుడ్ నటి ప్రంశల వెల్లువ; RRR సిక్ ఫిల్మ్ అంటూ ట్వీట్; సిక్ అంటే అర్థం వేరులే...

RRR: తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఎప్పటికప్పుడు కొత్తగా వార్తలకు ఎక్కుతూనే ఉంది. ఇటీవలే ఆస్కార్ బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ సినిమాపై తాజాగా ఓ హాలీవుడ్ నటి ట్వీట్ చేయడంతో మరోసారి టాక్ ఆప్ ది టౌన్ అయింది.


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'ను చూసి తెగ ముచ్చటపడిపోయిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటీమణి నాటాలి ఎమాన్యుయెల్ ఇదొక సిక్ సినిమా అంటూ ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరీ అంతమాట అనేసిందేంటి అని కంగారు పడకండి. ఆమె దృష్టిలో సిక్ అంటే చెత్త అని కాదు...చాలా గ్రేట్ అని అర్థం. అదే ముచ్చటను చక్కగా ట్వీట్ చేసిన ఈ చిన్నది తెలుగువారి మనసులు దోచిందనే చెప్పాలి.


ఇక మరొక ట్వీట్ లో ఈ సూపర్ హీరో బ్రొమాన్స్ అదిరిపోయిందంటూ పేర్కొంది నాటాలీ. నాటునాటు సాంగ్ కొరియోగ్రఫీ కేక అని ట్వీట్ చేసింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లో డానరీస్ టార్గెరియన్ కు నమ్మిన బంటుగా కనిపంచిన ఈ అందాల భామ క్రమంగా హాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటోంది. మరి ఒకే ఒక్క ట్వీట్ తో తెలుగువారి దృష్టిలో పడిన ఈ చిన్నది ఇటు వైపు వచ్చే ఆలోచన చేస్తుందేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story