RRR: కాస్ట్యూమ్స్ లేవు ఏం లేవు.. తీసుకొచ్చి కూర్చోబెట్టారు: రామ్ చరణ్ ఆగ్రహం

RRR: కాస్ట్యూమ్స్ లేవు ఏం లేవు.. తీసుకొచ్చి కూర్చోబెట్టారు: రామ్ చరణ్ ఆగ్రహం
కాస్ట్యూమ్స్ లేవు, ఏం లేవు.. పొద్దుపొద్దున్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని చరణ్ చిరు కోపం ప్రదర్శిస్తే.. కార్తికేయ..

RRR : ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పోస్టర్‌లు, టీజర్‌లు చిత్రంపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. చరణ్-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈరోజు నుంచి ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది మా టీమ్.. మేం ఉక్రెయిన్‌ఏం చేస్తున్నామో ప్రతి రోజూ మీతో పంచుకుంటాం. ఆ సరదా సంగతులను మీక్కూడా తెలియజేస్తాం అంటున్నారు తారక్.

ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. అందులో తారక్.. చరణ్‌తో డ్రమ్స్ ప్రాక్టీస్ చేశావా అంటే.. ఆ అయిపోయింది అంటూనే నిజమైన డ్రమ్స్ ఎక్కడ కార్తికేయ అని రాజమౌళి కొడుకును అడుగుతూ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్ట్యూమ్స్ లేవు, ఏం లేవు.. పొద్దుపొద్దున్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని చరణ్ చిరు కోపం ప్రదర్శిస్తూ అడుగుతున్నాడు. అక్కడే ఎదురుగా కూర్చున్న కార్తికేయ.. వస్తున్నాయి.. ఓ రెండు నిమిషాలు అని నవ్వుతూ సమాధానమిస్తున్నాడు.

కాగా, ఈ భారీ బడ్జెట్ చిత్రం దసరాకి రానున్నట్లు చరణ్ ఈ వీడియోలో స్పష్టం చేశారు. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్, ఎలిసన్ డ్యూడీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story