కొమరం భీం ప‌వ‌ర్ పెంచిన 'చరణ్' వాయిస్‌

కొమరం భీం ప‌వ‌ర్ పెంచిన చరణ్ వాయిస్‌
వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయ్‌.. నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌తాయ్‌..

ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్ టి ఆర్ లు హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంభదించిన ఎన్ టి ఆర్ క్యార‌క్ట‌ర్ టీజ‌ర్ కొమ‌రం భీం ఈ రోజు విడుద‌ల చేశారు. రాజ‌మౌళి ముందుగా మోష‌న్ పోస్ట‌ర్ లో చూపించిన‌ట్టే ఒక‌రు అగ్ని, మ‌రొక‌రు నీళ్ళు లా ఈ టీజ‌ర్ కొండ‌లోయ‌ల్లో, సెల‌యేళ్ళ మీద విజువ‌ల్ మొదలు పెట్టారు.

అగ్ని స్వ‌భావ పాత్ర ధారి అల్లూరి సీతారామ‌రాజు ప‌వ‌ర్‌ఫుల్ వాయిస్ తో ఈ టీజ‌ర్ కి ప్రాణం పోసారు రామ్‌చ‌ర‌ణ్‌. గ‌తం లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర స్వ‌భావాన్ని తెలిపే భాగ్యం కొమ‌రం భీం తీసుకుంటే ఈ సారి కొమ‌రం భీం పాత్ర స్వ‌భావాన్ని తెలిపే భాద్యత అల్లూరి సీతారామ‌రాజు తీసుకున్నాడు. రాజ‌మౌళి విజువ‌ల్ ఫీస్ట్ మాత్రం రెండు టీజ‌ర్స్ కి స‌మానం గా అందించాడు. రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ కి ఇటు మెగాఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు.

ఇంత బ్యాల‌న్స్ గా ప్ర‌మోష‌న్ ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి కి ట్రేడ్ లో ప్ర‌శంశ‌లు దక్కుతాయి. వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయ్‌.. నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌తాయ్‌.. వాడి పొగ‌రు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీక‌ట్ల‌ని చీల్చే మండుటెండ‌.. వాడు భూత‌ల్లి చ‌నుపాలు తాగిన మ‌న్యం ముద్దు బిడ్డ‌.. నా త‌మ్ముడు గోండు వీరుడు కొమ‌రం భీం.. అంటూ రామ్ చ‌ర‌ణ్ విజువ‌ల్ కి త‌గ్గట్టుగా వాయిస్ పిచ్ పెంచుతూ చెప్ప‌టం ఈ టీజ‌ర్ కి హైలెట్ గా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story