Pavan Kalyan Divorce Rumours: విడాకుల... 'వై' చీప్ ట్రిక్స్...!

Pavan Kalyan Divorce Rumours: విడాకుల... వై చీప్ ట్రిక్స్...!
పవర్ స్టార్ ను ఎదుర్కోలేక బురదజల్లే ప్రయత్నమని మండిపడుతోన్న జన సైనికులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ వివాహాలు, విడాకులపై మరోసారి మాట్లాడి వివాదాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఇంట మరోసారి విడాకుల మాట వినిపించడం యాధృశ్చికంగానే జరిగిపోయింది. ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న పవర్ స్టార్ ప్రస్తుత సహధర్మచారిణి అన్నా లెజ్నెవాతోనూ తెగదెంపులకు సిద్ధమైనట్లు జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది. దీంతో తెెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కసారిగా ఈ అంశంపై పెద్ద దుమారమే చెలరేగింది.

అయితే లోతుగా పరిశీలిస్తే దీనివెనుక జనసేనానికి బద్థశత్రువులైన పార్టీ హస్తం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెప్పాల్సిందే. పదే పదే పవర్ స్టార్ వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తూ అతని ఒచిత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారు, కావాలనే ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లు జనసైనికులు మండిపడుతున్నారు. గత ఎన్నికల వేళ కూడా ఇదే విధంగా పవన్ కల్యాణ్ వివాహాలపై బురదజల్లే ప్రయత్నం చేశారు. రకరకాల కారణాల వల్ల అప్పటికి ఆ ఎత్తుగడ సానుకూలంగా మారడంతో తాజా ఎన్నికలకూ అదే ట్రిక్ వాడేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రస్తుతం పవర్ స్టార్ విజయ వారాహీ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. జనసేనానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయి ఉన్న ప్రజలు సైతం పవర్ స్టార్ ను అఖండ విజయం దిశగా నడిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డ ప్రత్యర్థి పార్టీ కుట్రపూరిత కథనాలకు శ్రీకారం చుట్టిందని జనసైనికులు తూర్పారబడుతున్నారు. ఇదే విధంగా పవర్ స్టార్ వ్యక్తిగత జీవితంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించచబోమని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు వార్తా ఛానళ్ల ప్రచురిస్తున్న కథనాలను రాజకీయ పార్టీల సోషల్ మీడియా హౌస్ లు వక్రీకరిస్తోన్న వైనం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏ వార్తనైనా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల వేళ సమీపిస్తుండటంతో ఇప్పటికే సోషల్ మీడియాలోని తమ అధికారిక పేజీల్లో అడ్డగోలుగా చెలరేగిపోతున్నారు. తప్పుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇదే కొనసాగితే ప్రజలకు తప్పుడు వార్తలు చేరే ప్రమాదముంది.

Tags

Read MoreRead Less
Next Story