Sai Pallavi: సినిమాలకు టాటా పై క్లారిటీ...

Sai Pallavi: సినిమాలకు టాటా పై క్లారిటీ...
సాయి పల్లవి సినిమాలకు దూరమవుతోందని కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలు; కొన్ని రోజుల్లోనే క్లారిటీ ఇవ్వనున్న పల్లవి...

అదిరిపోయే పర్ఫార్మెన్స్ తోనూ, కళ్లు మిరుమిట్లు గొలిపే డాన్స్ తో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్న సాయి పల్లవి ఇకపై సినిమాలకు దూరమవ్వబోతోందన్న వార్త కొంతకాలంగా టిన్సెల్ టౌన్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సాయిపల్లవి కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే అమ్మడు సొంత ఆసుపత్రిని నిర్మింస్తోందని, ఇకపై దాని బాగోగులే చూసుకోబోతోందని వినిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె కొత్త సినిమాలకు సంతకాలు చేసిన దాఖలాలు కూడా లేకపోవడంతో ఇక ఈ వార్తను ఖరారు చేసుకున్నారు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. సాయి పల్లవి ప్రస్తుతానికి సినిమాలకు దూరమవ్వడంలేదని స్పష్టమవుతోంది. ఇటీవలే అమ్మడు తెలుగులో ఓ భారీ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకారం తెలిపిందట. నెట్ ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ ను ఎక్స్ క్లూజివ్ గా రూపొందించబోతున్నారట. టాలీవుడ్ క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దీనికి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఇక పోతే ఈ వెబ్ సిరీస్ లో సాయి పల్లవి పాత్ర అద్భుతంగా ఉండబోతోందని, ఆమె తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రను పోషించలేరని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. ఏమైనా ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏమైనా ప్రస్తుతానికి సాయి పల్లవి నటనకు టాటా అయితే చెప్పడం లేదు. కాబట్టి, ఫ్యాన్స్ కాస్త నిమ్మళంగా ఉండవచ్చన్నమాటే....

Tags

Read MoreRead Less
Next Story