విరాట పర్వం : సైకిల్‌పై సాయి పల్లవి!

'విరాట పర్వం' చిత్రంలో సాయి పల్లవి పాత్రను మూవీ యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలిపింది.

విరాట పర్వం : సైకిల్‌పై సాయి పల్లవి!
X

'విరాట పర్వం' చిత్రంలో సాయి పల్లవి పాత్రను మూవీ యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సాయిపల్లవి పోస్టర్ ను పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ లో సాయి పల్లవి సైకిల్ తొక్కుతూ కనిపిస్తుంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నాడు.

ఇప్పటికే రానా లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.. రానా, సాయి పల్లవితో పాటుగా ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా 'విరాట పర్వం' 2021 ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

RELATED STORIES