Samajavaragamana: విజయం తథ్యమే.. సుమా..!

Samajavaragamana: విజయం తథ్యమే.. సుమా..!
సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న చిత్ర బృందం

సహాజమైన నటనతో ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు కి తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉంది. గత సినిమాలు ఆశించిన ఫలితాలు అందించకపోయినా సామజవరగమా ఆడియన్స్ ని మెప్పింస్తుందనే నమ్మకం కలిగింది. విడుదలకు ముందే వైజాగ్, విజయవాడ లలో ప్రివ్యూలు వేస్తున్న టీం కాన్ఫిడెన్స్ ను కొంతమంది హెచ్చరించారు. కానీ ప్రివ్యూలకు వస్తున్న రెస్పాన్స్ తో ఇప్పుడు టీం ఫుల్ ఖుష్ లో ఉంది.

రోమాంటిక్ కామెడీ జానర్ తో థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించడం అంటే ఇప్పుడు అంత తేలికైన విషయం కాదు. కానీ సామజ వరగమనలో కేవలం నవ్వించడం మాత్రమే పనిగా పెట్టుకోలేదు దర్శకుడు ఆ నవ్వులతో పాటు మనసుకు హాత్తుకునే కథ, సన్నివేశాలకు అందంగా అమర్చాడు. తండ్రిని డిగ్రీ పాస్ చేయించడం అనేది ఆస్థికోసం కాదు తాను ఒక ఫెయిల్యూర్ లా బంధువుల మద్య మిగలకూడదు అనే సన్నివేశంలో కథలో బలం తెలిసింది. అప్పటి వరకూ ఒక ఫన్ ఎలిమెంట్ లా కనిపించిన ఆ ట్రాక్ మనసులకు హాత్తుకోవడం మొదలైంది. నాయనమ్మ ను వృద్ధుల ఆశ్రమంలో చేర్చేందుకు అత్త, బాబాయ్ పెట్టిన డిస్కషన్ లో హీరో నాయనమ్మ తమతోనే ఉంటుంది అనే సన్నివేశంలో మల్టీప్లెక్స్ లలో బాక్సాఫీస్ కౌంటర్ లో పనిచేసే హీరో ఎంత ధనవంతుడో అర్ధం అయ్యింది. కేవలం నవ్వించడం మాత్రమే కాదు వాటి ని ముడివేసిన బలమైన ఎమోషన్స్ ని దర్శకుడు చాలా సున్నితంగా ప్రజెంట్ చేసాడు.


ఇక నరేష్ ఈ సినిమాలో నటించిన పాత్ర అతని కెరియర్ లో మెమరబుల్ అవుతుంది. ప్రేక్షకులకు కూడా ఒక ప్రెష్ నెస్ ని అందించింది. శ్రీవిష్ణు తన పాత్ర తో సినిమాను డ్రైవ్ చేసాడు. తన బలలాను బేస్ మీద పాత్ర ను నిలబెట్టాడు. కూల్ ఆట్యిటూడ్ తో సినిమా అంతా నవ్వులు పరిచాడు. అందుకే సామజ వరగమనా టీం అంత కాన్ఫిడెంట్ గా ఉంది. ఒక విన్నర్ ని ప్రజెంట్ చేయబోతున్నామనే కాన్ఫిడెంట్ గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story