'శాకుంతలం' అప్ డేట్.. 'శకుంతల' ఇష్టసఖి మరో స్టార్ హీరోయిన్..

పురాణ కావ్యాలు, చారిత్రక ఘట్టాలు, చరిత్ర నేర్పిన పాఠాలు.. వీటినే కథాంశంగా తీసుకుని అందమైన అపురూప దృశ్యకావ్యంగా మలచడంలో సిద్ధహస్తులు దర్శకుడు గుణశేఖర్.

శాకుంతలం అప్ డేట్.. శకుంతల ఇష్టసఖి మరో స్టార్ హీరోయిన్..
X

పురాణ కావ్యాలు, చారిత్రక ఘట్టాలు, చరిత్ర మనకి నేర్పిన పాఠాలు.. వీటినే కథాంశంగా తీసుకుని అందమైన అపురూప దృశ్యకావ్యంగా మలచడంలో సిద్ధహస్తులు దర్శకుడు గుణశేఖర్. విశ్వామిత్రుని కథలోని ఓ ముఖ్య పాత్ర శకుంతల.

ఆ పాత్రనే కథాంశంగా తీసుకుని సమంతను శకుంతల పాత్రలో చూపించనున్నారు దర్శకుడు. దుష్యంతుని పాత్రకు గాను మలయాళ హీరో దేవ్ మోషన్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని మరో ముఖ్య పాత్ర శకుంతల ఇష్టసఖి. ఆ పాత్ర కోసం తొలుత ఈషా రెబ్బాని అనుకున్నారట.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈషాను తప్పించి తమిళ నటి అదితి బాలన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుందని టాక్. అదితి నటించిన తమిళ మూవీ 'అరువి' ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు మెచ్చి గుణశేఖర్ అదితిని తీసుకునట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రానికి గుణశేఖర్ సతీమణి నీలిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Next Story

RELATED STORIES