'సారంగ దరియా' పాట విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు : జానపద గాయని కోమలి

సారంగ దరియా పాట విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు : జానపద గాయని కోమలి
సారంగ దరియా పాట వివాదం ముగిసింది.

'సారంగ దరియా'.. లవ్ స్టోరి మూవీలోని ఈ పాట సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఈ పాట వివాదం ముగిసింది. 'సారంగ దరియా' సేకరణ చేసిన జానపద గాయని కోమలి.. ఈ పాటను సినిమాలో ఉపయోగించడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. బుధవారం.. దర్శకుడు శేఖర్ కమ్ములను గాయని కోమలి కలిసింది.


సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో తనతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేదన్నారు గాయని కోమలి. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశానన్నారు. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ చొవరతో.. దర్శకుడు శేఖర్ కమ్ములని కలిసినందుకు.. సంతోషంగా ఉందన్నారు కోమలి.


శేఖర్ కమ్ముల రానున్న సినిమాల్లో అవకాశం ఉంటే తనతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చినట్లు కోమలి తెలిపారు. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట తనతోనే పాడిస్తానన్నట్లు తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇక సారంగ దరియా పాట విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కోమలి.



కమ్యునికేషన్ సమస్య వల్ల ఇన్ని రోజులు గాయని కోమలిని కలవలేకపోయాన్నారు శేఖర్ కమ్ముల. రానున్న సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తానన్నారు శేఖర్ కమ్ముల. సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని శేఖర్ కమ్ముల తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story