టాలీవుడ్

Sarkaru Vaari Paata Collections: 'సర్కారు వారి పాట' ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

Sarkaru Vaari Paata Collections: ఈ సినిమాకు కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించడం లేదు

Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
X

Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇస్తున్న సినిమా. చాలాకాలం తర్వాత మహేశ్‌లోని మాస్ యాంగిల్‌ను వెలికితీసింది ఈ సినిమా. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో కలెక్షన్లు కూడా అదే రేంజ్‌లో అదరగొడుతున్నాయి.

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాటకు కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు వైరల్ చేసినా.. అవన్నీ సినిమా రిజల్ట్‌పై, కలెక్షన్స్‌పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. ఫస్ట్ డే కలెక్షన్లతోనే పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది సర్కారు వారి పాట. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.36.63 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ సినిమా.

సర్కారు వారి పాట ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసిందంటే..

  • నైజాం - రూ. 12.24 కోట్లు
  • సీడెడ్ - రూ. 4.7 కోట్లు
  • ఈస్ట్ - రూ. 3.25 కోట్లు
  • వెస్ట్ - రూ. 2.74 కోట్లు
  • ఉత్తరాంధ్ర - రూ. 3.73 కోట్లు
  • గుంటూరు- రూ. 5.83 కోట్లు
  • కృష్ణా - రూ. 2.58 కోట్లు
  • నెల్లూరు - రూ. 1.56 కోట్లు
  • మొత్తం రూ.36.69 కోట్లు
Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES