టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు.. తెరపైకి ఓ సినీ నిర్మాత పేరు

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు.. తెరపైకి ఓ సినీ నిర్మాత పేరు
X

టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకేసు దర్యాప్తును ఎస్ ఆర్ నగర్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజు రెడ్డిని విచారిస్తున్నారు. కొద్దిసేపటిక్రితం దేవరాజురెడ్డి ఎస్ ఆర్ నగర్ పోలీస్టేషన్‌ లో విచారణకు హాజరయ్యారు. శ్రావణిని ఫోన్ లో బెదిరించిన ఆడియో.. అశోక్ తో శ్రావణి చెప్పిన అంశాల ఆధారంగా పోలీసులు దేవరాజ్‌ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా దేవరాజ్, సాయి కామెంట్స్‌ పై పోలీసులు దృష్టిసారించారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరాజ్ రెడ్డి విచారణ తర్వాత సాయిరెడ్డి, శ్రావణి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించనున్నారు. వారి స్టేట్ మెంట్స్ రికార్డుచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేవరాజ్ రెడ్డి- శ్రావణిల ఆడియో టేపులు, వీడియోలను సేకరించిన పోలీసులు ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలను బయట పెడుతానని దేవరాజ్ రెడ్డి బెదిరిస్తున్నాడని శ్రావణి, సినీ నిర్మాత అశోక్ రెడ్డికి చెప్పినట్లు ఆడియో బయటకు వచ్చింది. దీని ఆధారంగా చేసుకొని ప్రశ్నించే అవకాశాలున్నాయి.

Next Story

RELATED STORIES