ఆ సినిమాలో పవన్‌‌కళ్యాణ్, శోభన్‌‌బాబు కలిసి నటించాల్సింది కానీ..!

ఆ సినిమాలో పవన్‌‌కళ్యాణ్, శోభన్‌‌బాబు కలిసి నటించాల్సింది కానీ..!
అప్పటివరకు పవన్‌‌కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడిగానే సుపరిచితుడు.. కానీ ఆ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయిని తీసుకువచ్చింది

అప్పటివరకు పవన్‌‌కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడిగానే సుపరిచితుడు.. కానీ ఆ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయిని తీసుకువచ్చింది ఆ సినిమా.. అదే సుస్వాగతం. ఆర్ బి చౌదరీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోతారు ప్రేక్షుకులు.

ప్రేమని, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు. అప్పటివరకు విలన్ గానే నటించిన రఘువరన్ ఓ పాజిటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. కన్న కొడుకును దగ్గరుండి చూసుకునే ఓ తండ్రి పాత్రలో ఆయన జీవించారు. ఇక నటుడిగా కూడా పవన్ కి మంచి గుర్తుంపు తెచ్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో తండ్రి క్యారెక్టర్ కోసం మొద‌ట శోభ‌న్ బాబునే అడిగార‌ట‌.

పవన్ కళ్యాణ్ కి తండ్రిగా శోభన్ బాబు అయితే పర్ఫెక్ట్ అని ఆర్ బి చౌదరీ భావించి ఆ పాత్ర కోసం ఆయనని అడిగారట. కానీ అప్పటికే సినిమాల‌నుంచి రిటైర్ అయిన శోభ‌న్‌బాబు ఈ ఆఫర్ ని తిరస్కరించాట. దీనితో పవన్‌‌కళ్యాణ్, శోభన్‌‌బాబు కాంబోలో సినిమా మిస్ అయింది. కాగా శోభన్ బాబు, చిరంజీవి మాత్రం కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.

Tags

Read MoreRead Less
Next Story