'శృతి' మీరింది.. పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి?

సాధారణంగా సెలబ్రిటీ ఇంటినుంచి బయటకు వస్తే చాలు కెమెరాలు క్లిక్కుమనిపిస్తూ, వీలైతే సెల్ఫీ దిగుతూ సందడి చేస్తుంటారు ఫ్యాన్స్.

శృతి మీరింది.. పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి?
X

సాధారణంగా సెలబ్రిటీ ఇంటినుంచి బయటకు వస్తే చాలు కెమెరాలు క్లిక్కుమనిపిస్తూ, వీలైతే సెల్ఫీ దిగుతూ సందడి చేస్తుంటారు ఫ్యాన్స్.. ఇక హీరోయిన్స్ తమ లవర్స్‌‌తో బయటకు వస్తే అంతే సంగతులు.. ఫొటోలు, వీడియోలు తీస్తూ, వారినే కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ శ్రుతీహాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌‌‌లో కనిపించింది. ఈ జంటను చూసిన అభిమానులు.. తమ ఫోన్‌ కెమెరాల్లో బంధించడం మొదలుపెట్టారు. అటు శ్రుతీహాసన్‌ కూడా వారికి ఫోజులు ఇస్తూ సై అనేసింది.

అంతేకాకుండా పక్కనే ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్‌గా ముద్దులు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్‌‌‌‌మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి? 'శృతి' మీరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

Next Story

RELATED STORIES