ఎస్పీ బాలును తలుచుకుంటూ సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్.. !

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరు లేకుండా తెలుగు సినిమా పాటను మనము ఊహించలేము.

ఎస్పీ బాలును తలుచుకుంటూ సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్.. !
X

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరు లేకుండా తెలుగు సినిమా పాటను మనము ఊహించలేము. నటుడిగా, సింగర్ గా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న బాలు.. ఈ లోకాన్ని వ విడిచి ఏడాది కావస్తుంది. గతేడాది 2020 సెప్టెంబర్‌25న కన్నుమూశారు బాలు. ఈ సందర్భంగా ఆయనని తలుచుకుంటూ సింగర్ సునీత ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

"మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది. సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చూసుకుంటావ్ అనే నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.." అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సునీత.

ఎస్పీబీతో కలిసి సునీత పలు పాటలు పాడిన సునీత.. స్టేజ్‌ షోలలో పాలు పంచుకుంది.

Next Story

RELATED STORIES