నా జీవితంలోకి వచ్చిన ఓ మంచి స్నేహితుడు..: సింగర్ సునీత

చివరికి ఆ రోజు రానే వచ్చింది.

నా జీవితంలోకి వచ్చిన ఓ మంచి స్నేహితుడు..: సింగర్ సునీత
X

ఆమె పాడితే పరవశించని తెలుగు ప్రేక్షకులు ఉండరు.. అందమైన రూపం, అద్భుతమైన గళం ఇచ్చిన దేవుడు జీవిత భాగస్వామిని మాత్రం అర్థం చేసుకునే వాడిని ఇవ్వలేదని ఇద్దరు పిల్లలు పుట్టిన తొలి నాళ్లలోనే వివాహ బంధానికి ముగింపు పలికారు సుస్వరాలను సుమధురంగా ఆలపించే సునీత. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఎన్నో రూమర్లు.. రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ వచ్చిన సునీత.. సడెన్‌గా ఆమె అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

త్వరలో రామ్ అనే వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాను త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రామ్‌తో నిరాడంబరంగా జరిగిన నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

''అందరిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఓ తల్లిగా నేనూ ఆరాటపడుతున్నాను.. అలాగే నా పిల్లలు కూడా నాకో కొత్త జీవితం కావాలని కోరుకుంటున్నారు. అలాంటి పిల్లలు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. చివరికి ఆ రోజు రానే వచ్చింది. నా జీవితంలోకి ఓ మంచి స్నేహితుడు వచ్చాడు.. ఆయనతో నా జీవితాన్ని పంచుకుంటున్నాను. మేము ఇద్దరం త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నాని తప్పుగా అనుకోవద్దు.

అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా మంచిని కాంక్షించే నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.. ఎప్పటిలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని సునీత పోస్ట్ పెట్టారు. కాగా, సునీత చేసుకోబోయే వ్యక్తి డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని. సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Next Story

RELATED STORIES