ఆ సినిమా తీశాక చంపేస్తారని భయపడి వారం రోజుల పాటు బయటకు రాని కృష్ణవంశీ..!

ఆ సినిమా తీశాక చంపేస్తారని భయపడి వారం రోజుల పాటు బయటకు రాని కృష్ణవంశీ..!
ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ.

ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. అందులో భాగంగా వచ్చిందే ఖడ్గం.. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. దేశభక్తి నేపధ్యంతో వచ్చిన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదలకుండా చూస్తారు.

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ. ఖడ్గం సినిమా విడుదలయ్యాక తనని ఎక్కడ చంపెస్తారో అని భయపడి కృష్ణవంశీ వారం రోజుల పాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడని కాపాడడానికి ఒక్కరు కూడా రాలేదని చెప్పుకొచ్చాడు.

1993లో ముంబై పేలుళ్లలో చాలా మంది చనిపోయారు. ఆ సంఘటన అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కృష్ణవంశీని బాగా కదిలించింది. ఆ సంఘటనలో నుంచే ఈ ఖడ్గం మూవీని తెరకెక్కించారు కృష్ణవంశీ. సింధూరం తర్వాతే ఈ కథని చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ లతో ఈ సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళతో అయితే కమర్షియల్ హంగులు అడ్డు వస్తాయని శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ లతో చేశారు.

Tags

Read MoreRead Less
Next Story