బాలసుబ్రహ్మణ్యం కుటుంబ నేపథ్యం..

బాలసుబ్రహ్మణ్యం కుటుంబ నేపథ్యం..

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంది సంగీత సాగరంలాంటి కుటుంబం. కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో 1946 జూన్ 4న జన్మించారు. తండ్రి ఎస్పీ సాంబమూర్తి హరికథా కళాకారుడు. కథకు సంగీతం, కవిత్వం జోడించి రసవత్తరంగా చెప్పడంలో దిట్ట. దీంతో బాలసుబ్రహ్మణ్యంకు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఇక తల్లి శకుంతలమ్మ భక్తి పాటల పారవశ్యంలో మునిగితేలేవారు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్న పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడు. సంగీత సరస్వతి విలసిల్లిన కుటుంబంలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం... ఆ మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చక్కని గుర్తింపు పొందారు.

Tags

Read MoreRead Less
Next Story