బాలసుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు అందుకున్న అవార్డులు గురించి తెలిస్తే..

బాలు గాత్రానికి ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి.

బాలసుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు అందుకున్న అవార్డులు గురించి తెలిస్తే..
X

బాలు గాత్రానికి ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. మన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలను ఆయన అందుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లలో ఆయన అందించిన సంగీత సేవలకు ఎన్నో సత్కారాలు లభించాయి. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే 29 నంది పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాల సుబ్రహ్మణ్యం. ఇక 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకుగాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవాన్ని పొందారు. సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016 అవార్డును బాలుకు ప్రదానం చేశారు.

Next Story

RELATED STORIES