బాలు ఎక్కువగా సంగీతం అందించింది ఆయన సినిమాలకే..

రకరకాల జానర్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ముఖ్యంగా ఆయన సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించారు బాలు.

బాలు ఎక్కువగా సంగీతం అందించింది ఆయన సినిమాలకే..
X

గాయకుడిగా బాల సుబ్రమణ్యం పాడని బాణి లేదు.. సంగీత దర్శకుడిగా కూడా ఆయన ఆ రోటీన్ బ్రేక్ కి కొనసాగించారు.. అన్ని రకాల పాటలు పాడిన బాలు.. తన స్వర పరిచిన బాణీలు కూడా అన్ని వైవిధ్యాలుండేలా చూసుకున్నారు. మాస్, క్లాస్, భక్తి, రక్తి పాటలతో పాటు కామెడీ సాంగ్స్ కూడా పాడారు. ఇలాగే రకరకాల జానర్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్స్ తీసిన జంధ్యాల సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించారు బాలు. హాస్య చక్రవర్తి జంధ్యాల దర్శకత్వంలో 5 సినిమాలకు పనిచేసారు.

బాలు పాటలు.. జంధ్యాల మాటలు తెలుగు తెరంతా పరుచుకుంటున్న టైం లో వీరిద్దరూ కలిసి కొన్ని పాటలకు పురుడు పోసారు. అలా మాట, పాటగా మారిన వీళ్లిద్దరు దర్శకులు, సంగీత దర్శకులుగా అయిదు సినిమాలకి పనిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే జంధ్యాల సినిమాలకే బాలు ఎక్కువగా సంగీతం అందించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మొదటి ఆల్బమ్ 'ముద్దుల మనవరాలు'. ఈ చిత్రంలో భానుమతి, సుహాసిని అమ్మమ్మ మనవరాలిగా నటించారు.

సాంప్రదాయాలు.. ఎల్లలు .. వీటిని గెలిచిన ప్రేమ ఎలా ఉంటుంది.. అనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా పడమటి సంధ్యారాగం. ఆ సినిమా అప్పట్లో వస్తున్న సినిమాలలో పూర్తి భిన్నమైనది. విజయశాంతికి జంటగా ఒక అమెరికన్ నటుడు థామస్ జాన్ నటించిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ అనుకోవచ్చు. ఆ సినిమాలో ని ఈ తూరుపు ఆ పడమర సాగిన సంగమమే...అనే పాట హాద్దులు లేని ప్రేమకు స్వర నీరాజనం చేసింది. ఆ సినిమాకు స్వరాలందించిన బాలుకు, సినిమా కు ఎంత పేరు వచ్చిందో ఆయన పాటలకు అంతే పేరు వచ్చింది.

నవ్వులవిందు లాంటి జంధ్యాల సినిమాలలో హాయిగా ఉండే స్వరాలు.. కామెడీ ట్రాక్ లకు సరిపోయే నేపథ్య సంగీతాలు అందించడంలో బాలు సక్సెస్ అయ్యారు. వారి ప్రయాణం నాలుగు నవ్వలు..ఆరు పాటలుగా హాయిగా సాగిపోయింది..జంధ్యాల సునిశిత హాస్యం.. హాయిగా సాగే పాటలు వీరి జంటను విజయవంతం చేసారు ప్రేక్షకులు..జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన 'వివాహభోజనంబు, నీకూ నాకూ పెళ్లంట' సినిమాలకు కూడా బాలు సంగీతం అందించారు. రాజేంద్రప్రసాద్, అశ్విని జంటగా నటించిన 'వివాహభోజనంబు' సినిమాలో కామెడీ ట్రాక్స్ కి ఎంత రెస్పాన్స్ వచ్చాయో ఎస్పీబీ చేసిన సంగీతానికి అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

Next Story

RELATED STORIES