Sreekaram.. శ్రీకారం మూవీ రివ్యూ

Sreekaram.. శ్రీకారం మూవీ రివ్యూ
Sreekaram.. మనసుకు హత్తుకునే కథ.. ఆలోచింపజేసే కథనం.. గుర్తుండిపోయే సినిమా శ్రీకారం.

Sreekaram Movie Review :

టైటిల్ : శ్రీకారం

నటీనటులు : శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, సాయికుమార్, మురళీ శర్మ, రావు రమేశ్ తదితరులు

నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీ ఆచంట

దర్శకంత్వం : బి. కిశోర్

మ్యూజిక్ : మిక్కీ జె. మేయర్

డీఓపీ : జే యువరాజ్

రిలీజ్ : మార్చి 11, 2021

మన సినిమా పేర్లతో పాటు కాన్సెప్ట్ లు కూడా మట్టి వాసనలతో నిండుతున్నాయి. కెరియర్ లో కమర్షియల్ సినిమాల కంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన హీరో శర్వానంద్. కొత్త దర్శకుడు బి. కిషోర్ దర్శకత్వంలో రూపోందిన శ్రీకారం విడుదలకు ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. మెగస్టార్, కేటీఆర్ ప్రచారకర్తలుగా మారి ఈ సినిమా పై మరింత అంచనాలను పెంచారు.



కథ:

కార్తిక్ (శర్వానంద్) హైదరాబాద్‌లో ఉండే ఐటి ఉద్యోగి. ప్రతి పండక్కీ ఇంటికి వెళ్లే కార్తిక్‌ని తన ఆఫీస్ లో పనిచేసే చిత్ర (ప్రియా) ప్రేమిస్తుంటుంది. తన ప్రేమను అవుననక.. కాదనక.. కార్తీక్ తన పనిలో ముందుకు వెళుతుంటాడు. ఈ నేపథ్యంలో కార్తీక్‌కి ప్రమోషన్ మీద అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. తన ప్రేమ విషయం తెలుసుకొని చిత్ర పేరెంట్స్.. కార్తీక్ ని కలుస్తారు. అయితే తనకు వ్యవసాయం అంటే ఇష్టమని దానికోసం జాబ్ వదిలేస్తున్నానని అందుకే చిత్ర ప్రేమను ఓప్పుకోలేకపోయానని అంటాడు కార్తీక్. కొడుకు అమెరికా వెళ్తున్నాడని అందరికీ గొప్పగా చెప్పుకున్న తండ్రికి కార్తీక్ నిర్ణయం బాధ కలిగిస్తుంది. అసలు కార్తీక్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు...? అతను తన నిర్ణయంతో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడు అనేది మిగిలిన కథ..?



కథనం:

విత్తనం మంచి దయితే చెట్టు మంచి దవుతుందని అందరూ అంటారు. అలాగే కిషోర్ ఆలోచనల మంచివి.. అందుకే కథ కూడా హృదయాలకు హత్తుకుంది. మట్టివాసనలు విలువ తెలిసిన ప్రతి మనిషి 'శ్రీకారం'తో కనెక్ట్ అవుతాడు. ప్రతి పండగకూ ఊరోస్తుంటే ఊరంతా పండగలా ఉందనకుంటే అది పోరబాటే అని మన ఆలోచనలను మర్చే కథను రాసుకున్నాడు.శర్వానంద్ ఈ కథకు పరెఫెక్ట్ గా సరిపోయాడు. ఐటి ఎంప్లాయ్ గా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో.. పోలంలో లుంగీ కట్టుకొని దిగుతుంటే అంత ముచ్చటగా ఉన్నాడు. కథ ను హృద్యంగా రాసుకున్న కిషోర్ దాన్ని మొదలు, ముగింపు అంతే అందంగా మలిచాడు. ప్రతి పండక్కీ ఇంటికి వచ్చే కొడుకులను చూసి ముచ్చటపడే తల్లిదండ్రులను చూస్తాం కానీ ప్రతి కొడుకు కళ్ళ ముందంటే అది ఇంకెంత పండగలా ఉంటుందో అని ఊహాకు రూపం ఇచ్చాడు.



పల్లెటూరిలో బ్రతకలేక, వేరే దారిలేక కొందర పట్నం వచ్చి పనిచేస్తుంటారు. అలా పనిచేస్తూ బ్రతికే చాలా కుటుంబాలకు రూపం నరేష్ పాత్రలో కనిపించింది. ఒక సన్నివేశంకి కళ్ళు చమర్చుతాయి. భవన నిర్మాణ కూలిలుగా, బ్యాంక్ ల ముందు వాచ్ మెన్ లుగా హోటళ్ళలో సర్వర్లుగా పనిచేస్తున్న రైతులను చూసి హృదయం ద్రవించింది.పండే పంటకు గిట్టుబాటు ధరుండదు.. కొనే వాడికి ధరల భారం తగ్గదు..ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు చదువుకునే వారు వ్యవసాయం లోకి రావాలి అనే ఆలోచనకు 'శ్రీకారం' తన పాత్రతో ముందడుగు వేసాడు శర్వానంద్. రైతు అంటే ఆత్మాభిమానం కలవాడు.. పురుగుల మందు తాగైనా చస్తాడు కానీ పరువు పోయి మాత్రం బ్రతకుడు.. అలాంటి రైతును హీరో చేసిన సినిమా శ్రీకారం.

ఉమ్మడి వ్యవసాయం లో స్వార్ధాలకు తావులేదు.. ఎవరి స్వార్దం వారు చూసుకుంటే ఉమ్మడిగా ఏ పని చేయలేము. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూపిస్తూనే దానికి పరిష్కారాలను చూపించాడు.

సత్య, సప్తగిరి పాత్రలు సరదాగా సాగాయి. రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. సాయికుమార్ పాత్ర కు న్యాయం చేసాడు. అయితే సెకండాఫ్ లో హీరోకు పెద్ద అడ్డంకులు లేకపోవడం.. తన సమస్యలను చాలా సులువుగా పరిష్కారం అవడం సినిమాగా కాస్త స్లో అయ్యింది అనిపించింది. హీరోయిన్ ప్రియా మోహాన్ చాలా చలాకీగా చేసింది. వస్తానంటివో పోతానంటివో పాట మంచి ఊపు తెచ్చింది. నేలవిడిచి సాము చేసే గారడీ కథలను దాటి నేలమీద నడిచే కథ శ్రీకారం.



చివరిగా:

మనసుకు హత్తుకునే కథ.. ఆలోచింపజేసే కథనం.. గుర్తుండిపోయే సినిమా శ్రీకారం..

- కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story