స్టార్స్‌తో పెళ్లా.. మజాకా.. ఊహించని విధంగా..

వాళ్లని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య వేలల్లో ఉన్నది కాస్తా లక్షల్లోకి చేరుకుంటుంది. అవును మరి ఇంతకు ముందంటే పేపర్లో వస్తేనే

స్టార్స్‌తో పెళ్లా.. మజాకా.. ఊహించని విధంగా..
X

అప్పటి వరకు వాళ్లెవరో తెలియదు.. కానీ అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ పొంది తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారితో జీవితాన్ని పంచుకుంటే.. ఒక్కసారిగా వారి దశ మారిపోతుంది. వాళ్లెవరో తెలుసుకునే ప్రయత్నంలో సోషల్ మీడియాను గాలించేస్తారు ఫ్యాన్స్.. దీంతో ఒక్కసారిగా వారి స్టేటస్ పెరిగిపోతుంది.. వాళ్లని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య వేలల్లో ఉన్నది కాస్తా లక్షల్లోకి చేరుకుంటుంది. అవును మరి ఇంతకు ముందంటే పేపర్లో వస్తేనే వార్త.

వాళ్లు రాసింది చదివి తెలుసుకునే వారు. ఇప్పుడు అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరికి కావలసిన ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో వచ్చేస్తుంది. ఉదాహరణకు దగ్గుబాటి రానా చేసుకున్న మిహికా బజాజ్ గురించి అంతకు ముందు ఎవరికీ తెలియదు.. ఎప్పుడైతే రానా ఆమెను పరిచయం చేశాడో.. అప్పుడే ఆమె గురించి మరింత సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు ఫ్యాన్స్. మొత్తానికి అప్పటి వరకు వేలల్లో ఉన్న ఆమె ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇప్పుడు ఆమెను 2 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.

అందాల తార కాజల్ వివాహం చేసుకుంటోందని తెలిసి కుర్రకారు నిద్రలేని రాత్రులు గడిపారు.. అయినా ఉండబట్టలేక ఇంతకీ ఆ చందమామను చేసుకునే అదృష్టవంతుడెవరో అని గుండెను చిక్కబట్టి సామాజిక మాధ్యమాల్లో వెతుకులాట మొదలు పెట్టారు.. దాంతో గౌతమ్ కిచ్లు ఫాలోవర్ల సంఖ్య అమాంతం లక్షకు చేరుకుంది.

ఇక మన తెలుగింటి అమ్మాయి మెగా బ్రదర్ తనయ నిహారిక పెళ్లి చేసుకుంటుందంటే తమ ఇంట్లో అమ్మాయికి పెళ్లవుతోందన్నంత ఆనందంతో ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ ముద్దపప్పు-ఆవకాయ ముద్దుగుమ్మను చేసుకునే వరుడుని చూసి చూడచక్కని జంట అని మెచ్చుకున్నారు.. ఇంతకీ ఎవరీ జొన్నలగడ్డ చైతన్య అంటూ సోషల్ మీడియాలో శోధించారు. ఇంకేముంది అప్పటి వరకు ఉన్న చైతన్య ఫాలోవర్ల సంఖ్య 35.3 వేల మంది నుంచి 78.2 వేలకు చేరుకుంది.

Next Story

RELATED STORIES