ఈ ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..!

సహజంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్ అనే చెప్పాలి. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.

ఈ ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..!
X

సహజంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్ అనే చెప్పాలి. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. కొందరు హీరోయిన్లు అలాగే ఇండస్ట్రీలో కొనసాగితే మరికొందరు హీరోయిన్లు మాత్రం ఒక రెండు సినిమాలతో ఫెడ్‌‌అవుట్ అయిపోతారు. అలా త్వరగానే ఫెడ్ అవుట్ అయిపోయిన జాబితా కిందికే వస్తుంది ఈ ఎన్టీఆర్ హీరోయిన్ సోనాలీ జోషి.

సోనాలీ జోషి అంటే ఎవరికీ తెలియదు కూడా.. సుబ్బు మూవీ హీరోయిన్ అంటే కాస్తా గుర్తుతెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సోనాలీ జోషి తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. ఆమె చేసిన సందడే సందడి, సుబ్బు, నాన్న నేను అబద్ధం వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే అలరించాయి. ఆ తరవాత రాంబాబు గాడి పెళ్ళాం మొదలగు సినిమాలు ప్లాప్ కావడంతో హీరోయిన్ గా ఫెడ్ అవుట్ అయిపోయి సినీ పరిశ్రమకు దూరమైంది.

దీనికితోడు అప్పట్లో ఈ అమ్మడు పలు బాలీవుడ్ ఆఫర్ల కారణంగా టాలీవుడ్ సినిమా ఆఫర్లని రెజెక్ట్ చేసింది.దీంతో చివరికి ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. చివరిగా మలయాళంలో ఓ సినిమా చేసినప్పటికీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నీ ఇవ్వలేదు. అయితే తాజాగా నటి సోనాలి ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడీ భామ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.Next Story

RELATED STORIES