Chiranjeevi : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్.. డైరెక్టర్ ఎవరంటే?

Chiranjeevi : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్.. డైరెక్టర్ ఎవరంటే?
Chiranjeevi : ఇప్పుడు వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నాడు.

Chiranjeevi : ఇప్పుడు వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్న చిరు... ఆ తర్వాత లుసిఫర్ అనే సినిమాని లైన్ లో పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ హీరోగా నటించిన చిత్రం 'ఎన్నై అరిందాల్'. ఈ సినిమాను తెలుగులో 'ఎంతవాడుగానీ' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే.. ఇప్పుడు ఇదే సినిమాను చిరు రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రీమేక్ కి సుజిత్ తెరకెక్కించబోతున్నాడంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story