రుహానీ శర్మ HER చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్‌ సపోర్ట్‌!

రుహానీ శర్మ HER చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్‌ సపోర్ట్‌!
రుహానీ శర్మ HER సినిమా విడుదల చేయనున్న సూరేష్‌ ప్రొడక్షన్స్‌


ఆమే అందం, ఆమే ధైర్యం, ఆమే సాహసం, ఆమే సర్వం అని చాటిచెప్పే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్‌ హీరోల సినిమాలకు గట్టి పోటీనే ఇస్తున్నాయి. రీసెంట్‌గా HIT సినిమాతో తన అందం, అభియనంతో టాలెంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మ కూడా ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉంది. సస్పెన్స్‌ థ్రిల్లర్ HERతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌ విడుదల చేయనుంది.

చిలసౌ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది రుహాణి శర్మ. HIT సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటోంది ఈ బ్యూటీ. అందాల ఆరబోత కంటే అభినయానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అందుకే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో HER సినిమా తెరకెక్కనుంది.

న్యాచురల్‌ స్టార్‌ నాని చేతుల మీదుగా విడుదలైన HER సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేసింది. శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్‌గా రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ మూవీలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.




ఈ నేపథ్యంలో HER ఫైనల్ కాపీ చుసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ లభించడం తమ విజయానికి తొలి మెట్టు అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.





ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది. గతంలో విడుదల చేసిన HER పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ చిత్రంలో రుహాణి శర్మ ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.

Tags

Read MoreRead Less
Next Story