Acharya : ఆచార్య నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్.. !

Acharya : ఆచార్య నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్.. !
సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవ్వగా, కేవలం రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో వెల్లడించింది.

సైరా నరసింహరెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో కలిసి నిర్మిస్తోంది.. కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా నుంచి గత కొంతకాలంగా ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవ్వగా, కేవలం రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో వెల్లడించింది. అప్డేట్ తో పాటుగా అభిమానుల కోసం ఓ సప్రైజ్ పిక్ ను కూడా వదిలారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇద్దరూ ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఒక నది ఒడ్డున కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఫోటో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ సిద్ధా అనే ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో మేరవనుంది. సినిమా విడుదల తేది పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా, సినిమా పైన అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story