తండ్రి బర్త్‌డేకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న సుస్మిత...!

తండ్రి బర్త్‌డేకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న సుస్మిత...!
సుస్మిత కొణిదెల.. చిరంజీవి పెద్దకూతురు. కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా మంచి ఫేం సంపాదించుకుంది. చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150, సైరా చిత్రాలకి ఆమె కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా పనిచేసింది.

సుస్మిత కొణిదెల.. చిరంజీవి పెద్దకూతురు. కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా మంచి ఫేం సంపాదించుకుంది. చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150, సైరా చిత్రాలకి ఆమె కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా పనిచేసింది. . ఇటీవల ఆమె తన భ‌ర్త విష్ణు ప్ర‌సాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్థాపించింది. ఇదిలావుండగా తన తండ్రి చిరంజీవి(ఆగస్టు 22) పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్నట్టుగా వెల్లడించింది. వెబ్ సిరీస్ త‌ర్వాత త‌న‌ రెండో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్టుగా ట్విట‌ర్‌లో ఓ టీజర్‌ విడుదల చేసింది. 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి మీకు మరో ఫన్‌ను అందించబోతున్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేంటో డాడీ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 21. 8.2021 తేదీన వెల్లడిస్తాను' అంటూ ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి దిమ్మలపాటి ప్రశాంత్ ద‌ర్శక‌త్వం వ‌హించ‌నున్నట్లుగా తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story