హీరోయిన్‌గా పనికిరాదన్నాడు.. చివరికి ఆమెనే పెళ్లాడి భార్యగా..

హీరో రాంకీ, నిరోషా కలిసి ఏడు సినిమాల్లో చేశారు.

హీరోయిన్‌గా పనికిరాదన్నాడు.. చివరికి ఆమెనే పెళ్లాడి భార్యగా..
X

ఈ సినిమాలో ఈమే హీరోయిన్ అని డైరెక్టర్.. నిరోషాను పరిచయం చేయగానే హీరో రాంకీ నోరెళ్లబెట్టారు. ఈమె హీరోయిన్ ఏంటండి.. పనిమనిషిలా ఉంది అని అన్నారు. అయినా డైరెక్టర్ నువు అవునన్నా కాదన్నా ఆమే హీరోయిన్.. ఈ చిత్రం తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుంది చూడు అంటూ సింధూర పువ్వులో రాంకీ పక్కన నటించే అవకాశాన్ని కల్పించారు డైరెక్టర్ దేవరాజ్. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రాధిక చెల్లెలు నిరోషను చూసి సింధూరపువ్వులో అవకాశమిశ్చారు దేవరాజ్.

1988లో తమిళంలో ప్రారంభమైన సింధూ పూవే చిత్రం తెలుగులో సింధూర పువ్వుగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. అప్పటి స్టార్ హీరో విజయ్‌కాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఈ చిత్రాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. ఇందులోని సింధూర పువ్వా.. నీవే చిందించరావా సంగీత ప్రియుల్ని అలరించింది. చిత్ర విజయంతో నిరోష లక్కీ హీరోయిన్‌గా ముద్ర పడింది.

బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారీ, చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం ఘర్షణ సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. హీరో రాంకీ, నిరోషా కలిసి ఏడు సినిమాల్లో చేశారు. ఆ చిత్రాలన్నీ ప్రేక్షకులను అలరించడంతో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి వవాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం సినిమాలకు స్వస్థి చెప్పిన నిరోషా టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. రాంకీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాలో కీలక పాత్రలో నటించారు.

Next Story

RELATED STORIES