Konda Surekha - Murali Love story : 'కొండా' దంపతుల లవ్ స్టోరీలో వర్మకి ఎం నచ్చింది?

Konda Surekha - Murali Love story : కొండా దంపతుల లవ్ స్టోరీలో వర్మకి ఎం నచ్చింది?
Konda Surekha - Murali Love story : సినిమా ఇండస్ట్రీలో వెతికితే చాలామంది కపుల్స్ మధ్య లవ్ స్టోరీలు ఉంటాయి. కానీ పాలిటిక్స్ లో మాత్రం అలా కాదు.

Konda Surekha - Murali Love story : సినిమా ఇండస్ట్రీలో వెతికితే చాలామంది కపుల్స్ మధ్య లవ్ స్టోరీలు ఉంటాయి. కానీ పాలిటిక్స్ లో మాత్రం అలా కాదు. ఎక్కడో రేర్ అని చెప్పొచ్చు.. అలాంటి రేర్ లవ్ కపుల్ కొండా సురేఖ, మురళి దంపతులు.. వీరి లవ్‌‌స్టోరీ పైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ 'కొండా' అనే ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణలో రాజకీయంగా కొండా దంపతులకి మంచి ఫేమ్ ఉంది. అలాంటి వారి పైన వర్మ సినిమా చేస్తుండడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనితో అసలు ఎవరీ కొండా సురేఖ, మురళి? వీరి మధ్య లవ్ స్టోరీ ఏంటి? అని నేటితరం యువత సెర్చింగ్ మొదలుపెట్టింది.

19 ఆగస్టు 1965 వరంగల్ జిల్లాలోని చెందిన ఊకల్‌‌లో జన్మించారు.. ఆమె తల్లిదండ్రులు చంద్రమౌళి, రాద.. సురేఖకి ఇద్దరు అక్కలు, ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఆమె ఇంటర్ పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో చదివారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఎల్బీ కళాశాలలో డీగ్రీ పూర్తిచేశారు. ఆ కళాశాలలో ఆమెకి సీనియర్ మురళి.. అయన పూర్తి పేరు మురళీధర్ రావు పటేల్.. తెలంగాణలో ఆర్ధికంగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబాలలో వీరు ఒకరు. సురేఖకి డీగ్రీ చేస్తున్న టైంలో ఆమెకి నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు.. వారందరి పేర్లు కూడా ఎస్ తోనే మొదలవ్వడం విశేషం.

చదువు, స్పోర్ట్స్, డిబేట్ ఇలా అన్నింటిలో మంచి నాలెడ్జ్ ఉన్న సురేఖను చూసి ప్రేమలో పడిపోయారు మురళి.. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. కానీ ఎప్పుడు కూడా ఆమెతో మాట్లాడేవారు కాదట.. ఓ రోజు బస్‌‌స్టాప్‌‌లో నిల్చొని ఉన్నప్పుడు బైక్ పైన వచ్చి ఫోన్ నెంబర్ రాసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయారట. నెంబర్ తీసుకున్న సురేఖ ఓ రెండు రోజుల తర్వాత బాగా అలోచించి ఫోన్ చేశారట. అయితే అప్పుడు మురళి కాకుండా ఆయన రైస్ మిల్ లో పనిచేసే ఎల్లయ్య అనే వ్యక్తి ఫోన్ లిప్ట్ చేశాడట. అప్పుడు సురేఖ ఫోన్ చేసిందని చెప్పండి అంటూ అతనికి సురేఖ చెప్పారట. ఆ తర్వాత రోజున సురేఖ షేటిల్ ఆడుతున్న టైంలో మురళి బుల్లెట్టు బండి పైన వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్‌‌గా ప్రపోజ్ చేశారట.

అప్పటికీ మురళి అంటే ఇష్టం ఉండడంతో ఆయన ప్రపోజల్ కి ఒకే చెప్పారట ఆమె.. సురేఖ కాలేజీలో చదువుకుంటున్న టైంలోనే స్కూటీ మెయిన్‌‌టెన్ చేసేవారట. ఆ రోజుల్లో అమ్మాయిలు బైక్ నడపడం ఓ గ్రేట్ అని భావించారట మురళి .. సురేఖకి ఫేవరేట్ హీరో శోభన్ బాబు.. ఇక మురళి ఫేవరేట్ హీరోయిన్ స్మిత పాటిల్ నాలుగు సంవత్సరాల వీరి ప్రేమ ఇంట్లో తెలిసిపోయిందట. అప్పుడు అనుకోని పరిస్థితిల్లో మురళి వాళ్ళ అన్నయ్య చనిపోవడం, ఆయనకీ ఓ కొడుకు ఉండడంతో ఇద్దరు తొందరగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట.

1987 సురేఖ వాళ్ళ ఇంట్లో అందరు ఉండగానే సాయింత్రం ఏడు గంటల సమయంలో ఓ హీరో లాగా వచ్చి సురేఖను తీసుకెళ్ళి తిరుపతిలో వివాహం చేసుకున్నారట మురళి. 1988లో వీరికి సుస్మిత పటేల్ జన్మించింది. అదే సంవత్సరంలో మురళి సర్పంచ్‌‌గా ఎన్నికవ్వడం విశేషం. తన ఫేవరేట్ హీరోయిన్ స్మిత పాటిల్ గుర్తుగా మురళి తన కూతురుకి సుస్మిత పటేల్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు సుస్మిత పటేల్ కూడా రాజకీయాల్లో వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆమెకి ఓ కూతురు కూడా ఉంది.

కొండా సురేఖ 1999లో మొదటిసారిగా శాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆ తర్వాత 2004లో మరోసారి గెలిచారు. ఇక 2009లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా పనిచేసారు. రాజశేఖరరెడ్డి మరణం అనతరం కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీకి రాజీనామా టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ నుంచి 2014లో ఎమ్మెల్యేగా వరంగల్ తూర్పు నుంచి గెలిచారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరి టీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి పైన ఆమె ఓడిపోయారు.

ఇప్పుడు వీరి పైన వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడు సినిమాని తెరకెక్కించడం అటు రాజకీయంగా, ఇటు చిత్రపరిశ్రమలో మంచి బజ్ ఏర్పడింది. వీరి లవ్ స్టోరీకి ఫిదా అయ్యానని అందులో 10 శాతం తీసిన చాలని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story