హీరోగా శ్రీకాంత్ కెరీర్ డౌన్‌‌ఫాల్ కావడానికి కారణాలు ఇవే...!

హీరోగా శ్రీకాంత్ కెరీర్ డౌన్‌‌ఫాల్ కావడానికి కారణాలు ఇవే...!
ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ స్టార్‌‌గా ఎదగడం అంటే అది మాములు విషయం కాదు. అలా ఇండస్ట్రీలో ఉన్నవారు చాలా అరుదని చెప్పాలి.

ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ స్టార్‌‌గా ఎదగడం అంటే అది మాములు విషయం కాదు. అలా ఇండస్ట్రీలో ఉన్నవారు చాలా అరుదని చెప్పాలి. అందులో ఒకరు హీరో శ్రీకాంత్.. చిన్నచిన్న విలన్ పాత్రలతో సినీ కెరీర్ మొదలుపెట్టి.. వంద సినిమాల హీరో అనిపించుకునేదాకా వెళ్ళాడు. అయితే ఇంకా హీరోగా రాణించే వయసు, సత్తా, గ్లామర్ ఉన్నప్పటికీ శ్రీకాంత్‌‌కి హీరోగా వేషాలు ఎందుకు తగ్గాయి. శ్రీకాంత్ చేసిన మిస్టేక్స్ ఏంటి.. ?

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్‌‌కు నటుడిగా మొదటి సినిమా. మొదట్లో చిన్నచిన్న పాత్రలతో, విలన్‌‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. వన్‌‌బైటు (1993) హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత వచ్చిన తాజ్‌‌మహల్ (1995) సినిమా మంచి విజయం సాధించడంతో శ్రీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి (1996) చిత్రం శ్రీకాంత్ కెరీర్‌‌ని అమాంతం మార్చేసింది.

ఎగిరే పావురమా, వినోదం, ప్రేయసి రావే, ఆహ్వానం, మా నాన్నకు పెళ్ళి, కన్యాదానం సినిమాలు శ్రీకాంత్‌‌ని ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి. ముఖ్యంగా శ్రీకాంత్ మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. దీనితో వరుస సినిమాలతో శ్రీకాంత్ ఫుల్ బిజీ అయిపోయాడు. అలా అతి తక్కువ టైంలో వంద సినిమాలను కంప్లీట్ చేశాడు. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న శ్రీకాంత్ కెరీర్ అంతే ఫాస్ట్ గా డౌన్‌‌ఫాల్ అయిపొయింది.

హీరోగా శ్రీకాంత్ కెరీర్ పీక్స్‌‌లో ఉన్నప్పుడు అంటే.. 1998, 99మధ్యలో నాలుగు సంవత్సరాల వరకు సినిమాలకు అడ్వాన్సు తీసుకొని కమిట్ అయ్యాడు. ఇందులో కొన్ని సినిమాలు హిట్ అవ్వగా, మరికొన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఇక శ్రీకాంత్‌‌కి ఉన్నది ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్.. ఈ ఇమేజ్‌‌ని పక్కన పెట్టి నిధి, ఇంగ్లిష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు అనే మాస్ నేపధ్యంలో ఉన్న సినిమాలను చేశాడు. ఈ సినిమాలు శ్రీకాంత్ కెరీర్‌‌కి మైనస్‌‌గా నిలిచాయి.

ఇక శ్రీకాంత్ హీరోగా ఉన్న సమయంలో తనకి పోటిగా ఉన్న వడ్డే నవీన్, జగపతిబాబు లాంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలను చేయడం శ్రీకాంత్‌‌కి ఓ రకంగా మైనస్ గా మారిందని చెప్పాలి. ఇక అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న వారుసల ఎంట్రీ కూడా శ్రీకాంత్ కెరీర్‌‌కి మైనస్‌‌గా మారిందని చెప్పాలి. ఇదే సమయంలో శ్రీకాంత్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా సినిమాలు చేసుకుంటూ పోవడంతో హీరోగా శ్రీకాంత్ కెరీర్ ఫెడ్ అవుట్ అయిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story