చిరు పిలిచి మరి ఆఫర్ ఇస్తే.. సినిమాని తీయలేకపోయిన ఇద్దరు టాప్ డైరెక్టర్స్.. !

చిరు పిలిచి మరి ఆఫర్ ఇస్తే.. సినిమాని తీయలేకపోయిన ఇద్దరు టాప్ డైరెక్టర్స్.. !
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడి కల.. దాన్ని ఓ అదృష్టంగా భావిస్తుంటారు వారు. కానీ చిరంజీవి ఎరుకోరి మరి ఆఫర్ ఇస్తే సరిగ్గా వాడుకోలేకపోయారు.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ప్రతి దర్శకుడి కల.. దాన్ని ఓ అదృష్టంగా భావిస్తుంటారు వారు. కానీ చిరంజీవి ఎరుకోరి మరి ఆఫర్ ఇస్తే సరిగ్గా వాడుకోలేకపోయారు ఓ ఇద్దరు దర్శకులు వాళ్ళే క్లాసిక్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. అయితే వీటి వెనుక పెద్ద స్టొరీనే ఉంది. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తర్వాత మళ్ళీ నిర్మాత అశ్వనీదత్‌‌తో ఓ సినిమాని చేయాలనీ అనుకున్నారు చిరంజీవి.

క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడంలో అశ్వనీదత్‌‌కి మంచి పేరుంది. అలా చిరంజీవి, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని సోషియో ఫాంటసిలోనే ప్లాన్ చేశారు. దీనికి భూలోకవీరుడి కథగా టైటిల్ అనుకున్నారు సింగీతం.. హీరోయిన్‌‌గా టబుని తీసుకున్నారు. షూటింగ్ మొదలు పెట్టి రెండు పాటలను కూడా చిత్రీకరించారు. మధ్యలో కథ, కథనాల విషయంలో సందేహాలు రావడంతో సినిమాని పక్కనపెట్టేశారు.

ఆ తర్వాత అశ్వనీదత్ నిర్మాతగా చిరంజీవి హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ సారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ సమయంలో సంజయ్ దత్‌‌తో ఓ సినిమాని తీస్తున్నారు వర్మ.. అయితే ఓ కేసులో సంజయ్ దత్ అరెస్ట్ అవ్వడంతో, ఈ క్రమంలో చిరంజీవితో సినిమాని ప్లాన్ చేశారు వర్మ.. హీరోయిన్‌‌గా రంగీలాను తీసుకున్నారు. వినాలని ఉంది టైటిల్.. రెండు పాటలను కూడా చిత్రీకరించారు.

అయితే ఈ టైంలో సంజయ్ దత్‌‌కి బెయిల్ రావడంతో ఈ సినిమాని పక్కన పెట్టేశారు వర్మ.. చిరు.. వర్మ సినిమా కోసం మూడు నెలల పాటు ఎదురుచూసి ఈ సినిమాని కూడా పక్కన పెట్టేశారు. వర్మ కూడా సారీ చెబుతూ రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చేశాడు. ఆ తరవాత ఆ చిరు, దత్తు కాంబోకి గుణశేఖర్ కనెక్ట్ అయ్యాడు. అలా 'చూడాలని ఉంది' సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.

Tags

Read MoreRead Less
Next Story