Tollywood: ఆసక్తిరేకెత్తిస్తోన్న 'బుట్టబొమ్మ'

విడుదలైన బుట్టబొమ్మ ట్రైలర్; టీనేజ్ లవ్ స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు....

టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బుట్టబొమ్మలో ఇంకెన్నో విశేషాలు దాగున్నాయని తెలుస్తోంది. ఈరోజే ట్రైలర్ విడుదలవ్వగా బుట్టబొమ్మ మాటున పెద్ద కథే ఉందని అర్ధమవుతోంది. టీనేజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమూ ఎంతో ఆసక్తికరంగానూ, అంతే ఆకర్షణీయంగానూ కనిపిస్తోంది. అనైకా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్యవశిష్ఠ, నవ్యస్వామి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేశ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయని చెప్పొచ్చు. గోపీ సుందర్ స్వరాలు అందించగా, గణేశ్ కుమార్ రావూరి డైలాగులు అందించారు. ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఫ్రిబ్రవరి 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరి బుట్టబొమ్మ ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story