Tollywood: ఒక్కటైన మంచు మనోజ్‌, భూమా మౌనిక

Tollywood: ఒక్కటైన మంచు మనోజ్‌, భూమా మౌనిక
మంచు లక్ష్మీ ఇంట్లో అంగరంగ వైభవంగా వివాహం

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ మరోసారి పెళ్లిపీటలెక్కాడు.దివంగత రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికారెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు మనోజ్‌- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు. అలాగే తమ పెళ్లి గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే నిన్న ఉదయం తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మనోజ్.తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మనోజ్. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ.. ఎం వెడ్స్ ఎం.. మనోజ్ వెడ్స్ మౌనిక.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

మరోవైపు మనోజ్‌ పెళ్లి వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించింది మంచు లక్ష్మీ. ఈ సందర్భంగా తనే స్వయంగా సోదరుడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసింది. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం.మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్..భూమా మౌనిక రెడ్డిల మధ్య చాలా కాలంగా ఫ్రెండ్‌షిప్‌ ఉంది. అందుకే వీరి వివాహం గురించి అనేకసార్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

Tags

Read MoreRead Less
Next Story