Tollywood: సినిమాలకు సామ్ లాంగ్ బ్రేక్.. అభిమానులకు షాక్!

Tollywood: సినిమాలకు సామ్ లాంగ్ బ్రేక్.. అభిమానులకు షాక్!
చికిత్స కోసం లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న సమంత, పలు హిందీ ప్రాజెక్ట్ ల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న నటి

Samantha Ru Prabhu: దక్షిణాది హీరోయిన్ల రేంజ్ ను పెంచిన అతి కొద్ది మంది నాయికల్లో సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. ఓ వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు తనలోని నటిని సైతం ఆవిష్కరించే పాత్రలు పోషించింది. ఇటీవలే యశోద మూవీతో మరో మెట్టు పైకి ఎక్కిన సామ్ ఇకపై బాలీవుడ్, హాలీవుడ్ లోనూ ఇరగదీస్తుందనుకుంటే, దైవం మరొకటి తలచినట్లు ఉంది పరిస్థితి.


నాగ చైతన్యతో డైవోర్స్ అయ్యాక బాలీవుడ్ లో వరుసగా పలు ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది సమంత. హాలీవుడ్ లోనూ ఓ భారీ ఆఫర్ అందుకుందని వినిపించింది. దీంతో ఇక మన జెస్సీ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు అభిమానులు. కానీ, అనారోగ్యం కారణంగా సామ్ ఈ ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుందని తెలుస్తోంది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లబోతోందట. గతంలో అమెరికాకు వెళ్లిన సామ్, ఇప్పుడు దక్షిణ కొరియాకు వెళుతోందని తెలుస్తోంది.


ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలసి ఖుషి సినిమాలో నటిస్తోంది సమంత. ఈ చిత్రానికిి సంబంధించి 60శాతం షూటింగ్ పూర్తవ్వగా మిగిలిన షూట్ ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే ఒప్పుకున్న పలు హిందీ ప్రాజెక్ట్ ల నుంచి స్వచ్ఛంధంగా తప్పుకుందట. తన వల్ల ప్రాజెక్ట్ లు ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే ఆమె ఈ పని చేసిందని తెలుస్తోంది. లాంగ్ బ్రేక్ తీసుకుని పూర్తిగా కోలుకున్నాక మళ్లీ కొత్త ప్రాజెక్ట్ లను పరిశీలిస్తుందని సామ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా సమంత సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story