ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చేసా : శ్రీముఖి

బుల్లితెర పై యాంకర్ గా అలరిస్తూనే వెండితెర పై అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది యాంకర్ శ్రీముఖి.

ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చేసా : శ్రీముఖి
X

బుల్లితెర పై యాంకర్ గా అలరిస్తూనే వెండితెర పై అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది యాంకర్ శ్రీముఖి. పాటాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ తరచూ ఫొటోషూట్‌లను, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలావుండగా ప్రస్తుతం ‍శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్‌' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


సినీ కెరీర్ కి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బంది పడ్డానని భావోద్యేగానికి లోనయ్యింది. 'యాంకర్‌గా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. షూటింగ్ చేసే సమయంలో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. దీనితో తిమ్మిర్లు వచ్చేవి. ఒక్కోసారి షూటింగ్ కోసం ఉద‌యం 7గంటలకు వెళ్తే మరుసటి రోజు ఉద‌యం 7గంటల‌కు ఇంటికి వచ్చేదాన్ని. అసలు ఖాళీ సమయమే దొరికేదు కాదని, దీనితో ఒక్కోసారి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అనే ఫీలింగ్ ఉండేదని, పలుమార్లు కన్నీరు పెట్టుకున్నానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అయితే తన తండ్రి ఇచ్చిన దైర్యంతోనే ముందుకు వెళ్లనని తెలిపింది.


ఇక 'క్రేజీ అంకుల్స్‌' సినిమా విషయానికి వచ్చేసరికి గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించారు. శ్రీముఖితో పాటుగా రాజా రవీంద్ర, మనో, భరణి కీలక పాత్రలు పోషించారు.

Next Story

RELATED STORIES