టాలీవుడ్‌కి నేడు బ్లాక్ డే..అప్పుడు ఆంధ్రా చాప్లిన్..ఇప్పుడు గానగంధర్వుడు

. 2019 లో ఆంధ్రా చాప్లిన్, 2020 గానగంధర్వుడు.. అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు.

టాలీవుడ్‌కి నేడు బ్లాక్ డే..అప్పుడు ఆంధ్రా చాప్లిన్..ఇప్పుడు గానగంధర్వుడు
X

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి అంతులేని విషాదాన్ని మిగిల్చిన రోజు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. గతేడాది ఇదే రోజు హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. ఆంధ్రా చాప్లిన్ గా కీర్తించబడ్డ వేణుమాధవ్ 2019 సెప్టెంబర్ 25న.. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. 2019 లో ఆంధ్రా చాప్లిన్, 2020 గానగంధర్వుడు.. అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఒకరు తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తే.. మరొకరు తన గానంతో ప్రపంచాన్ని పరవశింపజేశారు. ఈ రెండు ఘటనలు యాదృచ్ఛికమే అయినప్పటికీ.. సెప్టెంబర్ 25.. తెలుగు సినీ ఇండస్ట్రీకి బ్లాక్ డే గా మిగిలిపోయింది.

Next Story

RELATED STORIES